ఆమిర్ బిగ్ డీల్! అమీర్ ఖాన్ గతంలో ఒక బిస్కెట్ కంపెనీ, కోలా సంస్థ, ఓ కార్ల కంపెనీ, ఒక ఎఫ్ఎంసిజి, వాచీల తయారీ సంస్థ, శాటిలైట్ టివి సర్వీస్ ప్రొవైడర్ సంస్థ తరఫున వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. వాటి నుంచి సరాసరిన 12 రూపాయల పారితోషికం మాత్రమే లభించింది. తాజాగా దుబాయ్ టెలికమ్యూనికేషన్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం అతని పారితోషికం మూడు రెట్లు పెరిగినట్లైంది. ఇటీవలి కాలంలో అమీర్ ఖాన్ చిత్రాలు బాక్సాఫీస్ విజయాలు సాధించడమే ప్రకటనల పారితోషికం పెరగడానికి కారణం అని వాణిజ్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కాగా, తాజా వాణిజ్య ఒప్పందం ఫీజు విషయాన్ని అమీర్ ఖాన్ స్వయంగా ఖండించనూ లేదు. ధృవీకరించనూ లేదు. 'నా ప్రకటనలు చేయడంలో నేను పూర్తి ఆనందాన్ని అనుభవిస్తున్నాను. తాను పనిచేయాల్సిన బ్రాండ్ల విషయంలోను, క్రియేటివ్ టీమ్ ఎంపికలోను నేను చాలా సెలెక్టివ్ గా ఉంటాను. నేను చేసే సినిమాల కన్నా మరింత కష్టపడి వాణిజ్య ప్రకటనల కోసం పనిచేస్తాను' అని అమీర్ ఖాన్ పేర్కొన్నాడు.
ఇలా ఉండగా, వాణిజ్య ప్రకటనల కోసం అత్యధిక పారితోషికం తీసుకునే బాలీవుడ్ హీరోయిన్ గా నిలిచిన ప్రియాంకా చోప్రాకు లభిస్తున్నది కేవలం 3.5 నుంచి 4 కోట్ల రూపాయలే. సంవత్సరానికి 2.5 కోట్ల రూపాయలు తీసుకుంటున్న కరీనా కపూర్, కత్రినా కైఫ్ తరువాతి స్థానాల్లో నిలిచారు. గ్లోబల్ ఐకాన్ గా పేరుమోసిన ఐశ్వర్యారాయ్ కూడా వాచీలు, కాస్మొటిక్స్ సంస్థల కోసం చేస్తున్న వాణిజ్య ప్రకటనల ద్వారా పెద్దమొత్తంలోనే పారితోషికం రాబట్టుకుంటున్నారు.
Pages: -1- 2 News Posted: 5 March, 2010
|