పాత్ర పట్టు..అవార్డు కొట్టు అవకరాలు పాత్రలు
మానవుడికి పంచేంద్రియాలు సక్రమంగా పనిచేస్తుంటే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. అవార్డు ఇచ్చే జ్యూరీ సభ్యుల సానుభూతి సంపాయించాలంటే గుడ్డి, చెవుడు, మూగ లేదా రెండూ ఉన్న పాత్రలు ఎంచుకొవాలి. ఓ పెద్ద సహజమైన బలహీనత అద్భుతాలు సృష్టించగలదు. ఇలా చెప్పడం కొంచెం మనసుకు కష్టంగానే తోస్తుంది. కానీ సినీమాయా ప్రపంచంలో కాసులు కురిపించేది, అవార్డులు పండించేది ఇదే. అవకరాల పాత్ర సినిమా అంతా తన చేష్టలతో నవ్విస్తుంది. చివర్లో ఎక్కడో విషాదాన్ని మనం తట్టుకోలేనందగా పండిస్తుంది. అంతే జ్యూరీ సభ్యుల హృదయాలు పగిలిపోతాయి. అవార్డులు వచ్చి ఒళ్ళో వాలతాయి. కోయి మిల్ గయాలో హృతిక్ రోషన్, తారే జమీన్ పర్ లో దర్షీల్ సఫారీ, బ్లాక్ సినిమాలో రాణీ ముఖర్జి, ఫానాలో కాజోల్, ఫారెస్ట్ గంప్ లో టామ్ హేంక్స్, మై నేమీజ్ ఖాన్ లో షారూక్(వచ్చే యేడు దీనికి అవార్డు ఖాయమని బాలీవుడ్ బల్లగుద్ది మరీ చెబుతోంది మరి) వగైరాలన్నమాట.
నరికేయి..కాల్చిపాడేయ్..చంపేయి
ముఠా నాయకుడు పాత్రలు. ప్రజల్ని బీభత్సంగా భయపెట్టడం. ఎకె 47 తుపాకులతో పట్టుకోడానికి వచ్చిన పోలీసుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేయడం. అమ్మాయిలు గుడ్డలిప్పుకుని డాన్సులు చేసే బారుల్లో గడపటం, రౌడీ మామ్మూళ్లు వసూలు చేయడం. చివరకు తప్పదు ప్రమాదకరమైన పాత్రలు కాబట్టి దాన్లో పోతావ్. కానీ అవార్డు మాత్రం వస్తుంది. వాస్తవ్ లో సంజయ్ దత్, కంపెనీ లో అజయ్ దేవ్ గన్, గాడ్ ఫాథర్ సినిమాలో మార్లొన్ బ్రాండో తరహాలో నటించాలి.
మొగుణ్ణి చంపేయ్
నిజమేనండి బాబు. మీరు చదివింది అక్షరాలా నిజమే. భర్తను దేవునిలా కొలిచే పాత్రలకు ఏమొస్తాయి. పతియే ప్రత్యక్షదైవం రోజులు పోయాయి. ఇప్పుడంతా విప్లవం. మొగుళ్ళను చంపడం ద్వారా విప్లవాన్ని తీసుకురావడం. కావాలంటే చూడండి ఖూన్ భరీ మాంగ్ లో రేఖను, బాండిట్ క్వీన్ సినిమాలో సీమా బిస్వాస్ ను. అవార్డులా మజాకానా?
చచ్చిపోయే నటన
మీరు అమితంగా ప్రేమింటే మనిషి చచ్చిపోవడాన్ని చూడటం కంటే హృదయాలను ద్రవింపచేసే సన్నివేశం మరోకటి ఉండదు. చచ్చిపోయే పాత్రలో నువ్వుగనక జీవించేసి ప్రేక్షకులను రంజింపచేయగలిగాలి. సినిమా అయిపోయేంత వరకూ ప్రేక్షకులు నీ కోసం ఏడుస్తూనే ఉంటారు. నీ కోసం ప్రార్ధిస్తూనే ఉంటారు. సినిమా అయిపోయాక మరీ వెక్కివెక్కి ఏడుస్తారు...ఎందుకంటే నీ చావు నీకు అవార్డును చచ్చినట్టు తెచ్చిపెడుతుంది కనుక. ఆనంద్(హిందీ) సినిమాలో రాజేష్ ఖన్నా, ఫిలడెల్ఫియా అనే ఇంగ్లీషు మూవీలో టామ్ హేంక్స్ అలాగే అవార్డులు కొట్టేశారు.
Pages: -1- 2 -3- News Posted: 5 March, 2010
|