పాత్ర పట్టు..అవార్డు కొట్టు స్వలింగ సంపర్కం
అంటే స్వలింగ సంపర్కి నిజంగా నటిస్తే అవార్డులు గట్రా రావు. అయినా మన బాలీవుడ్ లో స్వలింగ్ సంపర్కులుగా బయటకు తెలిసిన నటులెవ్వరూ లేరు కూడానూ. తెర మీద స్వలింగ సంపర్క పాత్రలో ఇమిడిపోయి నటిస్తే రివార్డు ఖాయం మరి. దోస్తానా సినిమాలో అభిషేక్ బచ్చన్, మిల్క్ సినిమాలో సీన్ పెన్ మాదిరిగా అన్నమాట.
క్రికెట్ అవతార్
క్రికెట్ అంటే ఏమిటనుకుంటున్నారు. అది మన జాతీయ క్రీడ కాకపోయినా సరే.. క్రికెట్ అంటే మన దేశంలో మతం. దానికి బాలీవుడ్ లో సైతం పోటీ లేదు. ప్రజాదరణ విషయంలో షారూక్ కు సచిన్ కు పోటీ పెడితే ఏమవుతుంది. షారూక్ ఓడిపోతాడు. మరి క్రికెట్ సబ్జెక్ట్ తో సినిమా తీస్తే ఎందుకు హిట్టవదు. లగాన్ లో అమీర్ ఖాన్ కు అవార్డు తెచ్చిపెట్టి తీరింది కదా.
అందగత్తెను ముద్దాడు.. చంపేయ్
బాబో ఇదేంటని బెంబేలెత్తకండి. సీరియల్ కిల్లర్ కథలంటే మనోళ్ళు కళ్ళు పేలేసుకుని మరీ చూస్తారు. అదే అందగత్తెలను ముద్దు పెట్టుకుని ఆనక ఆ సౌందర్యాన్ని చంపేస్తే థ్రిల్లయిపోతారు. మానసిక పైశాచిక పాత్రలు పోషిస్తే చాలు కీర్తి శిఖరాలు ఎక్కడానికి దారి సులువవుతుంది. దుష్మన్ లో అసుతోష్ రానా, సైలెన్స్ ఆఫ్ ద లాంబ్ లో అంథోనీ హప్కిన్స్ ఇలాగే అవార్డులు పట్టేశారు.
కుర్ర పాత్రలు
నీ నిజమైన వయస్సు కంటే సగం తక్కువున్న పాత్రలు వేసేయ్. జ్యూరీ సభ్యులు నీ నటనా చాతుర్యాన్ని వేనోళ్ళ కీర్తించి ఓ భుజకీర్తి తగిలిస్తారు. 3 ఇడియట్స్ లో అమీర్ ఖాన్, పా సినిమాలో అమితాబ్ లే దీనికి తాజా ఉదాహరణ.
మరి ఈ చిట్కాలేవీ పని చేయలేదా.. అలా కాకూడదే.. జరక్కూడదే. అయినా ఫర్వాలేదు. ట్రైనెక్కు. బోగీ టాప్ మీదన్నమాట. డాన్స్ మొదలెట్టు. నీకు అవార్డు తెచ్చి పెట్టకపోవచ్చు. బోల్డెంత గుర్తింపు వచ్చేస్తుంది. నీ నాట్య నైపుణ్యాన్ని కోరియాగ్రాఫర్, నీలో ఉన్న బహుముఖ నటనా చాతుర్యాన్ని డైరెక్టరు గుర్తించేస్తారు. నీ అభిమానుల దృష్టిలో నువ్వు ధైర్యమున్న హీరో లేదా హీరోయిన్ గా వెలిగిపోతావు. ఎందుకంటే ఎవరైతే రైలు టాపెక్కి డాన్సు చేస్తారో వాళ్ళే హీరోలు ఇలాంటి అభిమానులకు. దిల్ సే సినిమాలో షారూక్ సాధించిందదే మరి.
Pages: -1- -2- 3 News Posted: 5 March, 2010
|