కపిల్ కు 'హాల్ ఆఫ్ ఫేమ్'
1959 జనవరి 6న చండీగఢ్ లో జన్మించిన కపిల్ దేవ్ తన 16 ఏళ్ళ క్రికెట్ జీవితంలో 131 టెస్ట్ మ్యాచ్ లు, 225 అంతర్జాతీయ వన్డేల్లో ఆడాడు. 1978లో క్వెట్టాలో భారత్ - పాకిస్తాన్ ల మధ్య జరిగిన వన్డేలో కపిల్ తొలి అంతర్జాతీయ వన్డే క్రికెట్ జీవితాన్ని ప్రారంభించాడు. ఫైసలాబాద్ లో మరో రెండు వారాల అనంతరం అదే పాకిస్తాన్ జట్టుతోనే జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా కపిల్ టెస్ట్ కెరీర్ లో ఆరంగేట్రం చేశాడు. పేస్ బౌలర్, ఆల్ రౌండర్ అయిన కపిల్ మొత్తం 434 టెస్ట్ వికెట్లు, 253 వన్డే వికెట్లు తీసుకుని అత్యుత్తమ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. 1994లో రిచర్డ్ హాడ్లీ రికార్డును దాటి టెస్ట్ లలో క్రికెట్ అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా కపిల్ కు రికార్డులకెక్కాడు. దీనితో వెస్టిండీస్ బౌలర్ కోర్ట్నీ వాల్ష్ రికార్డును కూడా కపిల్ బద్దలు కొట్టినట్లైంది. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న వెస్టిండీస్ బౌలర్ జోయెల్ గార్నర్ రికార్డును 1988లో కపిల్ తిరగరాశాడు. వన్డేల్లో కపిల్ చేసిన 253 వికెట్ల రికార్డు 1994లో పాకిస్తాన్ బౌలర్ వాసిం అక్రం అధిగమించే కపిల్ పేరుమీదే కొనసాగింది.
కపిల్ క్రికెట్ జీవితంలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనగా చెన్నైలో 1980లో పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ నిలిచిపోయింది. ఈ మ్యాచ్ లో కపిల్ 146 పరుగులకు 11 వికెట్లు పడగొట్టాడు. 1983లో జరిగిన ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో కపిల్ కేవలం 43 పరుగులకు 5 వికెట్లు తీయడం అత్యుత్తమ వన్డే బౌలింగ్.
కపిల్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 31.05 పరుగుల సరాసరిన 8 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలతో కలుపుకొని 5,248 పరుగులు చేశాడు. అలాగే వన్డేల్లో 3,783 పరుగులు చేశాడు.
Pages: -1- 2 News Posted: 9 March, 2010
|