రియల్ హీరోలే స్ఫూర్తి: ఆమీర్ ముంబై : ఇతరుల జీవితాల్లో, సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు తమ పరిధిని దాటి కృషి చేసే వాస్తవ జీవిత హీరోల గాథల నుంచి తాను స్ఫూర్తి పొందుతుంటానని బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ చెప్పారు. ఆమీర్ ఖాన్ తాజా చిత్రం '3 ఇడియట్స్' దేశంలోని విద్యా వ్యవస్థపై తులనాత్మక పరిశీలన జరిపింది.
'నేను వాస్తవ జీవిత హీరోలను చూసినప్పుడు, వారి కథలను విన్నప్పుడు నాకు నిజంగా స్ఫూర్తి కలుగుతుంటుంది. మనకు విభిన్న స్థాయిలలో బలాలు, సామర్థ్యాలు ఉన్నాయని నా భావన' అని ఆమీర్ బుధవారం ఒక కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేస్తూ చెప్పారు. 'మనం జీవితాల మెరుగుదల కోసం మన సామర్థ్యాలను మనం ఉపయోగించుకొంటే అది మామూలే అవుతుంది. కాని ఇతరులను ఆదుకోవడానికి ఎవరైనా తమ బలం, సామర్థ్యం ఉపయోగిస్తే వారే నిజమైన హీరోలు అవుతారు' అని ఆమీర్ పేర్కొన్నారు.
విద్య, పిల్లల కేటగరీలో సత్కారం పొందిన ఇర్ఫానా ఇస్మాయిల్ ముజావర్ వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. తన సహోద్యోగిని గజాలాతో పాటు ఇర్ఫానా తన పెళ్ళి కోసం ప్రత్యేకించిన డబ్బును ఉపయోగించి ఒక పాఠశాలను ఏర్పాటు చేసింది. చదువు ఖర్చు భరించలేని పిల్లలకు ఈ పాఠశాలలో ఉచితంగా విద్య గరుపుతారు. 'ఇది నిజంగా సుదీర్ఘ పోరాటం. నేను 34 మంది బడుగు విద్యార్థులతో ప్రారంభించాను. ఇప్పుడు మా స్కూలులో సుమారు 350 మంది విద్యార్థులు ఉన్నారు' అని ఇర్ఫానా 'ఐఎఎన్ఎస్' విలేఖరితో చెప్పారు.
Pages: 1 -2- News Posted: 11 March, 2010
|