రియల్ హీరోలే స్ఫూర్తి: ఆమీర్ దేశంలోని ఆరు ప్రాంతాలకు చెందిన 24 మంది వాస్తవ జీవిత హీరోలను ఎంపిక చేశారు. మహిళా సంక్షేమం, సాంఘిక సంక్షేమం,ఆరోగ్య, వైకల్యం, యువజన విద్య, పిల్లలు, క్రీడలు వంటి కేటగరీలుగా వారి కృషిని వర్గీకరించారు.
సుప్రసిద్ధ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. క్రీడల కేటగరీలో సచిన్ అవార్డు ప్రదానం చేయడానికి ముందు సభికులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. 'వాస్తవ జీవిత హీరోలు సామాన్య వ్యక్తులు కారు. వారు అసాధారణ వ్యక్తులు. వారికి వచ్చిందేమీ లేదు. కాని అన్ని అడ్డంకులను దాటుకుని, పరిష్కారాలను కనుగొనగల ధైర్యం వారికి ఉంది. వారు నిస్వార్థపరులు. వారికి ఎటువంటి ఆశలూ ఉండవు. తమ చుట్టూ ఉన్న జనం మొహాల్లో నవ్వులు చూడడమే వారికి కావలసింది. మనం వారి నుంచి స్ఫూర్తి పొందాలి' అని సచిన్ టెండూల్కర్ అన్నారు.
క్రీడల కేటగరీలో అవార్డు అందుకున్న మెర్జాబన్ పటేల్ కు దేశంలో అత్యుత్తమ ప్రతిభ గల హాకీ క్రీడాకారులను అన్వేషించడమే లక్ష్యం. 'నాకు ఈ అవార్డు లభించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. హాకీని ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని మెర్జాబన్ 'ఐఎఎన్ఎస్' విలేఖరితో చెప్పారు.ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో నటులు సునీల్ శెట్టి, రాహుల్ బోస్, దర్శక, నిర్మాత యష్ చోప్రా, వాణిజ్యవేత్త ముఖేష్ అంబానీ, ముంబై ఇండియన్స్ ఐపిఎల్ జట్టు సభ్యులు కూడా ఉన్నారు.
Pages: -1- 2 News Posted: 11 March, 2010
|