జారిపోయిన చార్జర్స్ ముంబయి: డిఫెండింగ్ ఛాంపియన్ డెక్కన్ ఛార్జర్స్ మళ్లీ పాత కథనే పునరా వృతం చేసింది. గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఖరి క్షణాల్లో బోల్తా పడింది. గత సీజన్‌లో చివరి స్థానంలో నిలిచి, ఈసారి కొత్త కెప్టెన్... కొత్త కోచ్... కొత్త డ్రెస్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలిమ్యాచ్‌లోనే ఛార్జర్స్‌కు షాకిచ్చి శుభారంభం చేశారు. ఇక్కడ జరిగిన ఐపీఎల్-3 ఆరంభ పోటీలో నైట్‌రైడర్స్ 11 పరుగుల తేడాతో ఛార్జర్స్‌పై గెలిచి, టోర్నీలో బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. మాథ్యూ (65 నాటౌట్: 46 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఓవైస్ షా (58 నాటౌట్: 46 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు అద్భుతంగా రాణిం చారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డెక్కన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్రమే చేసింది. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ మాథ్యూకు దక్కింది.
162 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డెక్కన్ ఛార్జ ర్స్‌కు ఓపెనర్లు గిల్‌క్రిస్ట్, లక్ష్మణ్‌లు శుభారంభం అందించారు. ఆరంభం నుంచే భారీ షాట్లతో కోల్‌కతా బౌలర్లపై విరుచుకు పడ్డారు. నిదానంగా ఆడే లక్ష్మణ్ కూడా షాట్లతో అలరించడం తో 4.5 ఓవర్లలో ఛార్జర్స్ స్కోరు 50కి చేరింది. అనంతరం భారీ సిక్స్ కొట్టి జోరుమీదున్న లక్ష్మణ్ (22: 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) మురళీకార్తీక్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు. తొలి వికెట్‌కు గిల్లీతో కలిసి లక్ష్మణ్ 61 పరుగులు జోడించాడు.
Pages: 1 -2- -3- News Posted: 13 March, 2010
|