జారిపోయిన చార్జర్స్ రెండు సార్లు ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గిల్లీ, హాడ్జ్ బౌలిం గ్‌లో సిక్స్ కొట్టి 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐతే కాసేపటికే మరో భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద మనోజ్‌కు క్యాచ్ ఇచ్చి గిల్లీ (54) నిష్ర్కమించాడు. ఆ వెంటనే గిబ్స్ (19), సైమండ్స్ (5), రోహిత్ (13), అనిరూధ్ (14), వాస్ (0)లు వెనువెంటనే నిష్ర్కమిం చారు. దాంతో ఛార్జర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్రమే చేసింది.
అంతకు ముందు డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ టాస్ గెలిచి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఐతే తొలి ఓవర్ లోనే వెటరన్ బౌలర్ వాస్ కోల్‌కతాను కోలుకోలేని దెబ్బ తీశా డు. తొలి బంతికే చిన్న దాదా మనోజ్ తివారీ మిడ్‌వికెట్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పెద్ద దాదా గంగూలీ నాలుగో బంతిని ఫస్ట్ స్లిప్‌లో అని రూధ్‌కు క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు. దాంతో తొలి ఓవర్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే కోల్‌కతా రెండు వికెట్లు కోల్పో యింది. వరుసగా రెండు బౌండరీలతో ఊపు మీద కన్పించిన యువ క్రికెటర్ చటేశ్వర్ పుజారా (10) ఆర్పీ బౌలింగ్‌లో షాట్ కొట్టేందుకు ప్రయత్నించి మిడాన్‌లో ఓజాకు చేతికి క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే బ్రాడ్ హాడ్జ్ (13) కూడా వెనుదిరగడంతో 31కే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అనంతరం నైట్‌రైడర్స్‌ను మాథ్యూ, ఓవైస్ షాలు ఆదుకు న్నారు. తొలి బంతినే సిక్స్ కొట్టిన మాథ్యూ ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. సైమండ్స్, ఓజాలు పొదుపుగా బౌలింగ్ చేయడంతో తొలి 10 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. 14 ఓవర్ల అనంతరం మెరుపులు మెరిపించారు. బౌండరీ, సిక్స్‌లు కొట్టేందుకు వీరిద్దరూ పోటీపడటంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. 15.4 ఓవర్లలో కోల్‌కతా స్కోరు 100కు చేరింది. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సుమన్ బౌలింగ్‌లో మాథ్యూ డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్ కొట్టి 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో షా కూడా అర్ధసెంచరీ చేశాడు. మాథ్యూ (65), ఓవైస్ షా (58) లు చివరి వరకు క్రీజులో నిలవడంతో కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి 14.5 ఓవర్లలో ఐదో వికెట్‌కు అజేయంగా 130 పరుగులు జోడించారు. చివరి 10 ఓవర్లలో 104 పరుగులు చేయడం విశేషం.
Pages: -1- 2 -3- News Posted: 13 March, 2010
|