డెవిల్స్ ఘనవిజయం మొహాలీ: గౌతమ్ గంభీర్ (72: 54 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరగులు చేసింది. ఓపెనర్ రవి బొపారా (56: 48 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 19.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. గంభీర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.
143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే సెహ్వాగ్ (8), దిల్షాన్ (0), డివిలియర్స్ (7), కార్తీక్ (20) వికెట్లను కోల్పోయింది. దాంతో మన్హస్ (31 నాటౌట్: 24 బంతుల్లో 2 ఫోర్లు) సహాయంతో గంభీర్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. వీరిద్దరూ కలిసి 61 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు. చివరి ఓవర్‌లో నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా గంభీర్ నిష్ర్కమించాడు. ఐదో బంతికి మన్హస్ బౌండరీ కొట్టి, మరో బంతి మిగిలుండగానే జట్టును గెలిపించాడు.
Pages: 1 -2- News Posted: 13 March, 2010
|