డెవిల్స్ ఘనవిజయం అంతకు ముందు టాస్ గెలిచి ఢిల్లీ కెప్టెన్ గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. తొలుత బిస్లా (2) రనౌట్ కాగా, కెప్టెన్ సంగక్కర 17 (9 బంతుల్లో 1 సిక్స్, 1 ఫోర్) కాసేపు మెరుపులు మెరిపించి మహారూఫ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అదే ఓవర్‌లో యువరాజ్ (4) కూడా నిష్ర్కమించాడు. ఇక జయవర్ధనే తొలి బంతికే డక్ ఔట్ కావడంతో పంజాబ్ 44కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో ఓపెనర్ బొపారా - ఇర్ఫాన్‌లు జట్టును ఆదుకున్నారు. బోపార 41 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఐతే బోపారాతో కలిసి 60 పరుగులు జోడించిన అనంతరం ఇర్ఫాన్ (21) ఔట్ అయ్యాడు. ఆ వెంటనే కైఫ్ (6), బొపారా (56)లు కూడా నిష్ర్కమించాడు. దాంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది.
స్కోరుబోర్డు
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: బొపారా (సి) మన్హస్ (బి) మహేష్ 56, బిస్లా (రనౌట్) 2, సంగక్కర (సి) సంగ్వాన్ (బి) మహారూఫ్ 17, యువరాజ్ (సి) గంభీర్ (బి) మహారూఫ్ 4, జయవర్ధనే (సి) కార్తీక్ (బి) సంగ్వాన్ 0, ఇర్ఫాన్ (స్టంప్) కార్తీక్ (బి) దిల్షాన్ 21, కైఫ్ (స్టంప్) కార్తీక్ (బి) మిశ్రా 6, చావ్లా (సి) మహారూఫ్ (బి) నానెస్ 5, పొవార్ (బి) నానెస్ 3, శ్రీశాంత్ (నాటౌట్) 15, అబ్దుల్లా (నాటౌట్) 0, అదనం 13, మొత్తం: 20 ఓవర్లలో 142/9
బౌలింగ్: నానెస్ 4-0-12-2, మహరూఫ్ 4-0-37-2, సంగ్వాన్ 4-0-32-1, మిశ్రా 4-0-23-1, మహేష్ 3-0-23-1, దిల్షాన్ 1-0-7-1
ఢిల్లీ డేర్‌డెవిల్స్: గంభీర్ (సి) జయవర్ధనే (బి) పఠాన్ 72, సెహ్వాగ్ (సి) జయవర్ధనే (బి) శ్రీశాంత్ 8, దిల్షాన్ (సి) బిస్లా (బి) 0, డివిలియర్స్ (రనౌట్) 7, కార్తీక్ (సి) పఠాన్ (బి) అబ్దుల్లా 20, మన్హస్ (నాటౌట్) 31, మహరూఫ్ (నాటౌట్) 1, అదనం 7, మొత్తం: 19.5 ఓవర్లలో 146/5
బౌలింగ్: ఇర్పాన్ 3.5-0-27-1,శ్రీశాంత్ 4-0-24-2, అబ్దుల్లా 4-0-30-1, చావ్లా 4-0-33-0, యువరాజ్ 3-0-11-0, పొవార్ 1-0-16-0
Pages: -1- 2 News Posted: 13 March, 2010
|