దున్నేసిన చార్జర్స్ చెన్నై: పటిష్ఠమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు తమ తొలి మ్యాచ్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. నిరుటి చాంపియన్ దక్కన్ చార్జర్స్ చేతిలో 31 పరుగుల తేడాతో ఓడిపోయి కంగుతిన్నది. కాగా తొలి మ్యాచ్‌లో ఓడిన చార్జర్స్‌కు ఇది తొలి విజయం. తొలుత చార్జర్స్ 4 వికెట్లకు 190 పరుగులు సాధించగా సమాధానంగా చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లు పడగొట్టి చార్జర్స్‌కు విజయాన్నందించిన చమింద వాస్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్సను వాస్ వరుస ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి దెబ్బతీశాడు. రెండో ఓవర్ తొలి బంతికే మురళీ విజయ్‌ను బలిగొన్న వాస్ నాలుగో బంతికి రైనానుకూడా పెవిలియన్ చేర్చాడు. ఆ తరువాత ప్రమాదకరంగా పరిణమిస్తున్న హేడెన్‌ను తన మూడో ఓవర్లో అవుట్ చేసి మ్యాచ్‌ను తమ జట్టుకు అనుకూలంగా మలిచాడు. ముగ్గురు హేమాహేమీలను కోల్పోయిన సూపర్ కింగ్స్ ఆ తరువాత కోలుకోలేకపోయింది. జస్టిన్ కెంప్, అల్బీ మోర్కెల్‌లతో కలిసి కెప్టెన్ ధోనీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా అది ఫలితాన్నివ్వలేకపోయింది. ధోనీ 42, మోర్కెల్ 42(నాటౌట్), కెంప్ 22 పరుగులు చేశారు. తక్కినవారు తక్కువ స్కోర్లకే నిష్క్రమించడంతో చెన్నై జట్టుకు ఓటమి తప్పలేదు. వాస్ 3, ఓజా, సిమండ్స్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
Pages: 1 -2- News Posted: 15 March, 2010
|