దున్నేసిన చార్జర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్కన్ చార్జర్స్‌కు ఓపెనర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, వివిఎస్ లక్ష్మణ్ అర్ధసెంచరీ భాగస్వామ్యంతో శుభారంభం అందించారు. ముఖ్యంగా గిల్‌క్రిస్ట్ చెన్నై బౌలర్లపై విరుచుకుపడి బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. అతడు 17 బంతులలోనే 4 బౌండరీలు, 3 సిక్సర్లో 38 పరుగులు సాధించి తరువాతి బ్యాట్సెమన్‌కు స్ఫూర్తినందించాడు. 55 పరుగులవద్ద వరుస బంతులలో గిల్‌క్రిస్ట్, లక్ష్మణ్ నిష్క్రమించినా సూపర్ కింగ్స్ కష్టాలు తీరలేదు. తరువాత వచ్చిన గిబ్స్, సిమండ్స్ సెంచరీ భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను పటిష్ఠపరిచారు. ఇరువురూ సంయమనంతో ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ స్కోరును పరుగెత్తించారు. అయితే ఇరువురూ పది పరుగుల తేడాతో రనౌట్లవడంతో ప్రత్యర్ధి బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత రోహిత్ శర్మ, తిరుమలశెట్టి సుమన్ మరో వికెట్ పడకుండా స్కోరును 190 పరుగులకు చేర్చారు.
స్కోర్‌బోర్డ్
దక్కన్ చార్జర్స్ : ఆడమ్ గిల్‌క్రిస్ట్ బి అశ్విన్ 38, లక్ష్మణ్ రనౌట్ 12, హెర్షల్ గిబ్స్ రనౌట్ 45, ఆండ్రూ సిమండ్స్ రనౌట్ 50, రోహిత్ శర్మ నాటౌట్ 19, టి.సుమన్ నాటౌట్ 10, అదనపు పరుగులు 16, మొత్తం (4 వికెట్లకు) 190.
వికెట్ల పతనం :! 1-55(గిల్‌క్రిస్ట్), 2-55 (లక్ష్మణ్), 3-150(గిబ్స్), 4-160(సిమండ్స్).
బౌలింగ్ : అల్బీ మోర్కెల్ 4-0-41-0, సుదీప్ త్యాగి 1.5-0-39-0, ముత్తయ్య మురళీధరన్ 4-0-28-0, ఆర్.అశ్విన్ 4-0-26-1, లక్ష్మీపతి బాలాజీ 4-0-36-0, జస్టిన్ కెంప్ 2.1-0-15-0.
చెన్నై సూపర్ కింగ్స్ : మురళీ విజయ్ బి వాస్ 3, మాథ్యూ హేడెన్ సి ఆర్పీ సింగ్ బి వాస్ 17, సురేష్ రైనా సి గిల్‌క్రిస్ట్ బి వాస్ 6, బ్రదీనాథ్ సి ఆర్పీసింగ్ బి ఓజా 5, జస్టిన్ కెంప్ స్టంప్డ్ గిల్‌క్రిస్ట్ బి ఓజా 22, ధోనీ బి సిమండ్స్ 2, అల్బీ మోర్కెల్ నాటౌట్ 42, అశ్విన్ సి ఆర్పీసింగ్ బి రోహిత్ 0, బాలాజీ సి అనిరుధ్ బి ఆర్పీసింగ్ 15, మురళీధరన్ ఎల్‌బి సిమండ్స్ 1, త్యాగి నాటౌట్ 3, అదనపు పరుగులు 3, మొత్తం (9 వికెట్లకు) 159.వికెట్ల పతనం : 1-12(విజయ్), 2-18(రైనా), 3-31(హేడెన్), 4-32(బ్రదీనాథ్), 5-70(కెంప్), 6-108(ధోనీ), 7-115(అశ్విన్), 8-136(బాలాజీ), 9-137(మురళీధరన్).
బౌలింగ్ : చమింద వాస్ 4-1-21-3, రోహిత్ శర్మ 4-0-27-1, ఆర్పీ సింగ్ 3-0-30-1, ప్రగ్యాన్ ఓజా 4-0-28-2, జస్కరణ్ సింగ్ 1-0-16-0, తిరుమలశెట్టి సుమన్ 1-0-8-0, ఆండ్రూ సిమండ్స్ 3-0-29-2.
Pages: -1- 2 News Posted: 15 March, 2010
|