టిటిడి బోర్డ్ నిర్ణయాలు
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సోమవారం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. బోర్డ్ చైర్మన్ డి.కె. ఆదికేశవులు నాయుడు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం విధుల నిర్వహణలో అసువులు బాసిన మొత్తం 11 మంది ఉద్యోగుల పిల్లలకు ఎన్ ఎం ఆర్ పోస్టుల్లో తీసుకోవాలని ఈ సందర్భంగా బోర్డ్ సమావేశం తీర్మానించింది. టిటిడిలోని పలు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పదోన్నతులు కల్పించాలని కూడా టిటిడి ట్రస్ట్ బోర్డ్ నిర్ణయించింది. దీర్ఘ కాలం పాటు విధులకు హాజరు కాకుండా ఉన్న అర్చక స్వాములు ఇకపై పదవీ విరమణ చేసినట్లు పరిగణించాలని పాలకమండలి నిర్ణయించింది. కాగా, చిత్తూరు జిల్లా పలమనేరులో వేంకటేశ్వర గో సంరక్షణ శాలకు నిధులు మంజూరు చేస్తూ టిటిడి ట్రస్ట్ బోర్డ్ సమావేశం తీర్మానించింది.
News Posted: 27 April, 2009
|