ధీమా ఉంటేనే రండి: షారుఖ్
ముంబై: ఫర్వాలేదు, భద్రత ఉంటుంది అని భావిస్తేనే మైదానానికి రండి. కోలకతా నైట్ రైడర్స్ (కెకెఆర్) మద్దతుదారులకు బాలీవుడ్ బాద్షా, కెకెఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ ఇచ్చిన సందేశం ఇది. 'భద్రత ఏర్పాట్ల గురించి మీకు భరోసా ఉంటేనే ఈడెన్ గార్డెన్స్ కు వచ్చి, పోటీలు తిలకించవలసిందని వీక్షకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా బిజినెస్ దెబ్బ తినే అవకాశం ఉన్నప్పటికీ నేను ఈ విజ్ఞప్తి చేస్తున్నాను' అని షారుఖ్ పేర్కొన్నారు.
లాహోర్ లో శ్రీలంక క్రికెట్ జట్టుపై ఉగ్రవాదులు జరిపిన దాడి వల్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)ను అనుమాన మేఘాలు ఆవరించాయి. అయితే, 'క్రీడాకారుల గురించి నేను బాధ పడ్డాను. కాని దీని కారణంగా మీకు జీవితం నిలచిపోరాదు.... ఎలా అయినా వెళ్ళి తన రోజు వారి భుక్తి కోసం పని చేయవలసిన వీధులలోని సామాన్యుడు ఉగ్రవాదం కారణంగా తన దైనందిన కార్యకలాపాలను నిలిపివేయడం గురించి ఆలోచించడు కదా' అని షారుఖ్ అన్నారు.
అయినప్పటికీ, '26\11 దాడుల అనంతరం నా చిత్రం రబ్ నె బనా ది జోడీ విడుదల సమయంలో థియేటర్లకు వెళ్లేటట్లయితేనే చిత్రం చూడవలసిందని నేను అన్నట్లుగా' భద్రతకేమీ ఫర్వాలేదని భావించినట్లయితేనే ఈడెన్ గార్డెన్స్ కు రావలసిందిగా జనాన్నితాను కోరుతున్నట్లు షారుఖ్ తెలిపారు. ముందు నిర్ణయించిన కార్యక్రమం ప్రకారమే ఐపిఎల్ మొదలయేటట్లయితే, తన మామూలు కెకెఆర్ 12వ ఆటగాడి బాధ్యతను పోషించడానికి షారుఖ్ మైదానంలో ఉంటారు. అయితే, ఐపిఎల్ మ్యాచ్ లను వాయిదా వేయాలని కేంద్రం సూచించిన తరువాత ఈ టోర్నీ అసలు సమయానికే ప్రారంభమవుతాయా అనేది సందేహాస్పదమే.
Pages: 1 -2- -3- News Posted: 6 March, 2009
|