ఐపిఎల్ ట్వంటీ కౌంట్ డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ స్టార్ లు, వాళ్లని కొనుక్కున్న బాలివుడ్ స్టార్ లతో తళుకులీనే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్ రెండో సంవత్సరం టోర్నమెంట్ కు దక్షిణాఫ్రికాలో శనివారం తెర లేవనుంది. ఓ వైపు టెర్రరిస్టుల భయం, మరోవైపు సార్వత్రిక ఎన్నికలతో తగినంత భద్రత కరవు కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నమెంట్ భారతదేశ సరిహద్దులు దాటి దక్షిణాఫ్రికాను వేదికగా చేసుకుంది. ఈడెన్ గార్డెన్స్ కు బదులు వాండరర్స్ లో, వాంఖడేకు బదులు సెంచూరియన్ లో.... ఐదు వారాల పాటు ఎనిమిది జట్లు మొత్తం 59 మ్యాచ్ లు ఆడతాయి. గత సంవత్సరం ముంబాయిపై టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో, ఉభయ దేసాల మధ్య సంబంధాలు మరింత క్షీణించడంతో, పాకిస్తాన్ ఆటగాళ్లు ఐపిఎల్ టోర్నీలో ఆడకుండా ఆ ప్రభుత్వమే నిషేధం విధించడంతో ఈ యేడాది పోటీల ఫ్లేవర్ కొంచెం తగ్గిందని చెప్పక తప్పదు.
ఐపిఎల్ ను ఖండాంతరాలకు తరలించినందుకు ఇండియా మాఫియా చంపుతామని బెదిరించడంతో ప్రాణాలరచేతిలో పెట్టుకుని, స్వీయ భద్రతా ఏర్పాట్లలో తలమునకలై వున్నారు. ఎంత సొమ్మైనా వెదజల్లి అత్యున్నతస్థాయి ఆటగాళ్లను ఆకర్షించడానికి ఈసారి చేసిన ప్రయత్నాలు కొన్ని విఫలమయ్యాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్, మైకేల్ హుస్సీ, మిచెల్ జాన్సన్ త్వరలో జరగబోయే యాషెస్ సిరీస్ కోసం ఐపిఎల్ ను వదులుకోగా, బ్రెట్ లీ, నాథన్ బ్రాకెన్, ఆండ్రూ సైమండ్స్ పాకిస్తాన్ తో అరబ్ ఎమిరేట్స్ లో జరిగే వన్డే సిరీస్ కోసం ట్వంటీ టోర్నమెంట్ కు డుమ్మా కొడుతున్నారు. మిగతా వాళ్లు మాత్రం అటువంటివేమీ పెట్టుకోకుండా 'అమ్ముడుపోయారు'.
Pages: 1 -2- -3- News Posted: 15 April, 2009
|