20 వరల్డ్ కప్ కు రెడీ
ఇంగ్లండ్ : ఇంగ్లండ్ లో ప్రారంభమయ్యే 20 వరల్డ్ కప్ లో ఎవరికి వారు విజేతగా నిలువాలనే పట్టుదలతో టోర్నీలో పోటీపడుతున్న 12 జట్లు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో ఎవరికి అవకాశాలున్నాయి? ఏ జట్టు బలం ఎలా ఉంది? ఎవరికి కప్ ఎగరేసుకుని పోగల సత్తా ఉంది? అనేది వేచి చూడాల్సిందే. సిక్సర్లు, బౌండరీలు, టర్నింగ్ తిరగే బంతులకు లేచి పడే వికెట్లు, విజయంతో ఎగిసిపడే ఆనందం, పరాజయంతో ఆపుకోలేని కన్నీళ్ల భారం, అద్భుతంగా రాణించినా ఒకటి రెండు తప్పులతో తప్పని ఓటమి, ఆఖరి ఓవర్లలో బలమైన షాట్లతో బౌలర్లకు నీరసం తెప్పించే వైనం కళ్ళముందుపడే క్యాచ్ లు కూడా అందుకోలేక బోర్లా పడే దుస్థితి, అడుగడుగునా టెన్షన్, ఒత్తిడి ఒకటి కాదు... ఎంతో ఉత్కంఠత, ఉద్విగ్నత కలిగించే ట్వంటీ 20 ప్రపంచకప్ కు నేడు ఇంగ్లాడ్ వేదికగా ప్రారంభమవుతున్నది.
మరి ఈ చాంపియన్ షిప్ విజేత ఎవరు? దీన్ని గెలుచుకోగలిగిన సత్తా ఎవరికి ఉంది? ఏ జట్టు ఈ ప్రతిష్ఠాకరమైన కప్ ను హస్తగతం చేసుకోనుంది. ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నే. అలాగే ముందుగా ఎవరూ ఊహించలేనిదే. 2007 దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి ప్రపంచకప్ ను గెలుచుకున్న ఇండియా సహజంగానే హాట్ ఫేవరైట్ గా బరిలో దిగుతుండగా, పలువురు క్రికెట్ ప్రముఖులు సైతం భారతే మరోసారి చాంపియన్ గా ఆవిర్భవించే అవకాశం ఉందని జోస్యం చెబుతున్నారు. అయితే ఈ ద్వితీయ టోర్నమెంట్ ను కైవసం చేసుకునేందుకు అగ్రశ్రేణి జట్లన్నీ కన్నేసి ఉన్నాయి. నాలుగు గ్రూపులు బరిలో ఉండగా ఒక్కొక్కదానిలో మూడేసి జట్ల చొప్పున మొత్తం 12 జట్లు పోటీలో ఉన్నాయి. తొలి రౌండ్ లో ఏ ఒక్క మ్యాచ్ గెలుచుకున్నా సూపర్ ఎయిట్ కు చేరవచ్చు. ఇక్కడ ఒక్కో జట్టు మూడేసి మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా రెండు గ్రూపుల నుంచి మొదటి రెండు స్థానాలకు చేరిన వారు సెమీస్ కు చేరుకుంటారు.
Pages: 1 -2- -3- News Posted: 5 June, 2009
|