గెలిస్తేనే మిగులుతాం!
లండన్: టోర్నీలో మిగిలుండాలంటే భారత్ మిగిలిన రెండు మ్యాచుల్లోను నెగ్గాలి. అంతే కాకుండా నెట్ రన్ రేట్‌ను కూడా మెరుగుపరుచుకోవాలి. లీగ్‌దశలో సునాయసంగా గెలిచిన భారత్‌కు సూపర్-8లో విండీస్ పెద్ద షాకిచ్చింది. రెండేళ్ల క్రితం కూడా భారత్ తొలి సూపర్-8లో పరాజయం పొంది ఆ తర్వాత టోర్నీలో సూపర్ విజయాలతో చాంపియన్‌గా నిలిచింది. ఈ సారికూడా ఇదే పునరావృతం చేస్తానని ధోనీ సేన ధీమాతో ఉంది. అప్పట్లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలపై నెగ్గి సెమీస్ వెళ్లి ఆ తర్వాత చాంపియన్‌గా నిలిచన భారత్ ఇప్పుడు కూడా ఈ రెండు జట్లతోనే తన భవితవ్యం తేల్చుకోవాల్సి రావడం విశేషం.
ఓపెనర్‌గా డాషింగ్ బ్యాట్స్‌మెన్ సెహ్వాగ్ లోటు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. పవర్‌ప్లేలో విరుచుకుపడే ఓపెనరే కరువయ్యాడు. ఆరం భంలో మెరుగ్గా ఆడిన రోహిత్ వీరూస్థాయి ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు. టాప్‌ఆర్డర్‌లో రోహిత్‌తో పాటు గంభీర్, రైనా ఫ్లాప్‌షో చేశారు. వీరు రాణించాల్సి అవసరం ఎంతకైనా ఉంది. మరోవైపు ధోనీ తన స్థాయి తగినట్లు ఆడలేకపోతున్నాడు. ఇక ఆశలన్నీ యువరాజ్‌పైనే వున్నాయి. యువీ క్రీజులో ఉన్నంతవరకు భారత్‌కు ఎలాంటి ఢోకాలేదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బౌలర్లను పెద్దగా నిందించాల్సిన పనిలేకున్న స్థాయికి తగినట్లు బౌలింగ్ చేయలేకపోయారు. వీరు సమర్థవంతంగా బౌలింగ్ చేసి ఫీల్డింగ్ సరిగ్గా ఉండింటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు.
Pages: 1 -2- -3- News Posted: 13 June, 2009
|