తొలి యాషెస్ టెస్ట్ డ్రా
కార్డిఫ్ : తొలి యాషెస్ టెస్టు విజయానికి అతి చేరువలోకి వచ్చి చేజార్చుకుంది. కాలింగ్ వుడ్, స్వాన్, అండెర్సన్ కలిసి స్థిరమైన బ్యాటింగ్ ప్రదర్శించడంతో ఇంగ్లాండ్ ఆఖరిరోజు ఆటలో తమ రెండో ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 252 పరుగులు చేయగలిగింది. అండెర్సన్ 21 (53 బంతుల్లో) పరుగులతో అజేయంగా మిగిలాడు. దీంతో వారు ఆస్ట్రేలియా విజయాన్ని అడ్డుకున్నారు.
అంతకు ముందు ఇంగ్లాండ్ పై 239 పరుగల మొదటి ఇన్నింగ్స్ సాధించిన ఆస్ట్రేలియా ఐదోరోజు టీ విరామ సమయానికి 169 పరుగులకే 7 వికెట్లు కూల్చినా ఫలితం లేకపోయింది. 8వ వికెట్ కు కాలింగ్ వుడ్, స్వాన్ (31) కలిసి అమూల్యమైన 62 పరుగులు జత కలిపారు. ఆ తర్వాత కాలింగ్ వుడ్ కు అండెర్సన్ తోడు నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా ఈ విజయాన్ని అందుకోలేకపోయింది. నాథన్ హౌరిట్జ్ అద్భుతంగా రాణించి కీలకమైన మూడు వికెట్లను కూల్చడం ద్వారా ఇంగ్లాండ్ ను ఇన్నింగ్స్ పరాజయానికి చేరువలోకి తెచ్చాడు. అతడికి మద్దతుగా హిల్పెన్ హూస్, జాన్సన్ చెరో వికెట్ సాధించారు.
ఆస్ట్రేలియా తిరిగి బ్యాటింగ్ కు దిగాలంటే ఇంగ్లాండ్ కనీసం 239 పరుగులు చేయాల్సి ఉండగా 252 పరుగులు చేయగలిగింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో ముఖ్యంగా పాల్ కాలింగ్ వుడ్ అమెఘంగా రాణించాడు. 177 బంతులను ఎంతో స్థిరంగా ఎదుర్కొన్న కాలింగ్ వుడ్ 55 పరుగులు చేయగా ఆపై 74 పరుగులకు అవుటయ్యాడు.
Pages: 1 -2- News Posted: 13 July, 2009
|