టీమిండియాలో ద్రావిడ్ చెనై: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మళ్ళీ భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. శ్రీలంకలో జరిగే ముక్కోణపు టోర్నీ, దక్షిణాఫ్రికాలో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో పాల్గొనే భారత క్రికెట్ జట్టుకు సెలక్టర్లు రాహుల్ ద్రావిడ్ ను ఎంపిక చేశారు. జాతీయ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ నేతృత్వంలో ఆదివారం చెన్నైలో సమావేశమైన సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన టీమిండియాను ఎంపిక చేసింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోనందున భారత స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను జట్టుకి ఎంపిక చేయలేదు. వరుసగా విఫలం అవుతున్న రోహిత్ శర్మ తోపాటు హైదరాబాద్ యువ స్పిన్నర్ ప్రజ్ఞా ఓజా జట్టులో స్థానం పొందలేక పోయాడు. సచిన్ టెండూల్కర్‌తో పాటు సురేశ్ రైనా తిరిగి జట్టులో చేరారు. స్పిన్నర్ అమిత్‌మిశ్రా తొలిసారిగా వన్డే బెర్త్‌ను దక్కించుకున్నాడు.
కొంతకాలంగా నిలకడగా ఆడలేక వన్డే జట్టులో చోటు కోల్పోయిన స్టార్ బ్యాట్స్‌మన్ ద్రవిడ్ ఎట్టకేలకు జట్టులో తిరిగి స్థానం పొందగలిగాడు. 2007 అక్టోబర నాగపూర్ వన్డేలో ద్రవిడ్ చివరిసారిగా ఆడాడు. దివాల్‌గా పేరొందిన ద్రవిడ్ ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్-2లో మెరుగ్గా రాణించాడు. అలాగే సెలక్షన్ కమిటీ సీనియర్లకు పెద్దపీట వేయడంతో ద్రవిడ్‌కు చోటు దక్కింది. మరోవైపు భు జం గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఓపెనర్ సెహ్వాగ్ ను జట్టుకు దూరంగా ఉంచారు. భుజం గాయం ఇంకా బాధిస్తుండడంతో అతన్ని జట్టుకు ఎంపిక చేయలేదు.
Pages: 1 -2- News Posted: 16 August, 2009
|