పాకిస్తాన్ గెలిచింది సెంచూరియన్ : దాయాదుల మధ్య పోరు హోరాహోరీగానే సాగింది. నరాలు తెగిపోయే ఉత్కంఠ లేకపోయినా ఉత్సుకత రగిలించే సమరమే సాగింది. ఓపెనర్ గౌతం గంభీర్ సుడిగాలి అర్ధసెంచరీ చేసినా, మిస్టర్ డిపెండబుల్ మరో మారు ఆపద్భాంధవుని పాత్ర పోషించినా వృధా ప్రయాసగానే మిగిలాయి. ఇక్కడ సూపర్ స్పోర్ట్ పార్క్ లో జరిగిన తొలిమ్యాచ్ లో భారత్ తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ చేతిలో 54 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్ ల్లో పాకిస్తాన్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ తీసుకుని 303 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. సవాలును స్వీకరించిన భారత బ్యాట్స్ మెన్లు సుడిగాలి ఇన్నింగ్స్ నే ఆరంభించారు. మాస్టర్ బ్లాస్టర్ త్వరగానే ఔటైనా తొణకని గంభీర్ షాట్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయినా చివరకు 44.5 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌట్ అయ్యి ఒత్తిడికి భారత్ తలవంచింది.
పాకిస్థాన్ కెప్టెన్ యూనిస్ ఖాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్‌లో కొత్తగా విరాట్ కోహ్లీ తుది జట్టులో చోటు దక్కించుకోగా, పాక్ జట్టులో మిస్బావుల్‌ను రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేశారు. ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ ఓపెనర్లు ఇమ్రాన్ నజీర్, కమ్రాన్ అక్మల్‌లు ఆరంభం నుంచే బౌండరీలతో ఎదురుదాటికి దిగారు. ఇదే తరుణంలో నెహ్రా వేసిన ఓ షార్ట్ పిచ్ బంతిని నజీర్ (20) ఓ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి మిడాన్‌లో హర్భజన్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. నజీర్ ఔట్ అయిన స్కోరు వేగంతగ్గలేదు. దాంతో ఏడు ఓవర్లలో పాక్ స్కోరు 50ని దాటింది. కానీ నెహ్రా, ఇషాంత్‌లు నిప్పులు చెరిగే బంతులతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. నెహ్రా వేసిన ఓ అద్భుత బంతికి అక్మల్ (19) ఔట్ అయ్యాడు. లైన్ అండ్ లెన్త్‌తో నెహ్రా, ఇషాంత్‌లు బౌలింగ్ చేయడంతో ఏడు ఓవర్లలో 51వద్ద ఉన్న పాక్ స్కోరు ఆ తర్వాత ఆరు ఓవర్లలో కేవలం ఆరు పరుగులు మాత్రమే రాబట్టారు. ఆరంభంలో భారీగా పరుగులు సమర్పించుకున్న ఆర్పీ ఫుల్ లెన్త్ బంతితో యూనిస్‌ఖాన్ (20)ను ఇంటిదారి పట్టించాడు. దాంతో పాక్ 65 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Pages: 1 -2- News Posted: 26 September, 2009
|