ఫలితం లేని భారత్ గెలుపు జోహెన్నెస్ బర్గ్ : ధోనీ సేన గెలిచి ఓడింది. ఐసిసి చాంపిన్స్ ట్రోఫీ లీగ్ దశ దాటకుండానే ఇంటి ముఖం పట్టింది. ఇక్కడి వాండరర్స్ స్టేడియంలో బుధవారం విండీస్ తో జరిగిన పై జరిగిన బి గ్రూప్ లోని ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఏడు వికెట్ల భారీ తేడాతో విజయం సాధించినప్పటికీ సెమీఫైనల్ చేరలేక చతికిలపడింది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ధోనీ వెస్టిండీస్ ను 36 ఓవర్లకే 129 పరుగులకు ఆలౌట్ చేసింది. గ్రూపు ఎ లో బుధవారం సెంచూరియన్ లో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ చేతిలో పాకిస్తాన్ రెండు వికెట్ల తేడాతో పరాజయం కావడంతో భారత్ ఇంటి ముఖం పట్టక తప్పలేదు. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందన్న చందమైంది భారత్ పరిస్థితి. పాయింట్ల పట్టీలో మరొక్క పాయింట్ సాధిస్తే ఆస్ట్రేలియా జట్టు సెమీస్ చేరుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పై ఆసీస్ ఈ మ్యాచ్ నెగ్గకపోతే సెమీస్ లో బి గ్రూపు నుంచి భారత్ అడుగుపెట్టే ఆశలు మిగిలి ఉండేవి. అయితే పాకిస్తాన్ జట్టు దురుద్దేశపూరిత వ్యూహం కారణంగా భారత్ అవకాశాలు చేజారిపోయాయి. చివరి లీగ్ మ్యాచ్ లో ఆసీస్ జట్టు ఆఖరి బంతికి పాకిస్తాన్ ను ఓడించి సెమీస్ లో స్థానం పొందింది. పాక్ ఓటమితో ఎ గ్రూపు నుంచి పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ కు చేరాయి.
మైదానంలోకి వచ్చిన భారత్ జట్టు తొలుత హుషారుగా ఆడారు. అయితే, ఎ గ్రూపులో ఆస్ట్రేలియా విజయం దిశగా సాగుతోందన్న సమాచారం తెలిసిన తరువాత ఇక లాభం లేదని డీలా పడ్డారు. భారత జట్టులో యాంత్రికత, నిస్పృహ చోటుచేసుకున్నాయి. కెప్టెన్ ధోనీ బౌలింగ్ చేశాడు. వన్డే అంతర్జాతీయ పోటీల్లో ధోనీ తొలి వికెట్ తీసుకున్నాడు. అయితే, పాక్ - ఆసీస్ జట్టు మధ్య జరిగిన పోటీ ఆఖరి దశలో పాకిస్తాన్ గెలిచే అవకాశాలున్నాయని తెలిసే సరికి మళ్ళీ ధోనీ సేన చెలరేగి బౌలింగ్ చేసింది. విండీస్ వికెట్లను వెంటవెంటనే పీకి పారేశారు. ఆ తరువాత మళ్ళీ అక్కడ ఆసీస్ గెలిచిందని తెలియగానే మళ్ళీ భారత్, విండీస్ జట్లలో నిస్సత్తువ ఆవరించింది. ఎలాగూ సెమీస్ లోకి వెళ్ళే అవకాసం లేకపోవడంతో భారత్ సాదా సీదాగా ఆడింది. వెస్టిండీస్ కూడా సీరియస్ గా తీసుకోలేదు. యువ క్రికెటర్లు ఈ మ్యాచ్ ను ప్రాక్టీస్ మ్యాచ్ వేదికగా ఉపయోగించుకున్నారు.
Pages: 1 -2- News Posted: 1 October, 2009
|