టీమ్ ఇండియా స్వయంకృతం జోహాన్నెస్ బర్గ్ : ఆస్ట్రేలియా దిగువ శ్రేణి బ్యాట్స్ మన్ లు తమ జట్టును సెమీ ఫైనల్స్ కు చేర్చడానికి గంట సేపు పళ్ళ బిగువున పోరాటం సాగిస్తుండగా ఒక మేలి మలుపు మరొక మలుపునకు కారణం కాగలదనిపించింది.. కనీసం చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ ముగిసేంత వరకైనా పాకిస్తాన్ పై రాజకీయ ఒత్తిడి లేకుండా చూడాలని ఢిల్లీ సౌత్ బ్లాక్ లోని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు ఆలోచించి ఉంటారు.
చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో బుధవారం సెంచురియన్ లో లీగ్ పోటీలో ఆస్ట్రేలియాకు 205 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించగా పాకిస్తాన్ విశిష్ట బౌలర్లు - స్వింగ్, సీమ్, స్పిన్ బౌలర్లు సంచలనాత్మకంగా మ్యాచ్ ను మలుపు తిప్పారు. రెండు వికెట్ల నష్టానికి 140 స్కోరుతో పటిష్టమైన స్థితిలో ఉన్న ఆస్ట్రేలియా ఆతరువాత కేవలం 40 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. పెరటి దోవ ద్వారానైనా ఇండియా సెమీ ఫైనల్స్ కు చేరుకునే అవకాశాలు అకస్మాత్తుగా మెరుగయ్యాయి.
ప్రముఖ క్రీడాకారులు లేని వెస్టిండీస్ ను 129 స్వల్ప స్కోరుకు పరిమితం చేసిన మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత క్రీడాకారుల బృందం ఆస్ట్రేలియన్ ఇన్నింగ్స్ చివరి రెండు ఓవర్లను టివిలో చూసేందుకై డ్రెస్సింగ్ రూమ్ కు పరుగు తీసింది. 12 బంతులలో పది పరుగులు స్కోరు చేయడం సాధారణంగా కష్టమైన పని కాదు. కాని అననుకూల పిచ్ పై పరిస్థితి సంక్లిష్టంగా మారింది. రివర్స్ స్వింగ్, 'డెడ్లీ' యార్కర్లతో పాకిస్తానీ బౌలర్లు పైచేయి సాధించారు. మరి బ్రెట్ లీ, నాథన్ హారిట్జ్ ఆ ఒత్తిడిని విజయవంతంగా అధిగమించగలరా?
కాని ధోనిని నిస్పృహకు గురి చేస్తూ వారు దాదాపుగా ప్రతి బంతికి పరుగు తీస్తూ లక్ష్యం దిశగా సాగారు. ఉత్కంఠభరితమైన పోరులో చివరకు చివరి బంతికి అత్యంత ప్రశంసనీయమైన విజయాన్ని వారు సాధించారు. అంతకుముందు పరిస్థితి ఎంత ఉత్కంఠభరితంగా ఉందంటే ఆస్ట్రేలియా కెప్టెన్ రిక్కీ పాంటింగ్ క్రీడాకారుల బాల్కనీలో నుంచి పోటీని వీక్షిస్తున్నప్పుడు గోళ్ళు కొరుక్కుంటూ కనిపించాడు. చివరకు కొరకడానికి గోళ్ళు కూడా ఉండవనేంతగా అతను ఆ పనిలో నిమగ్నమయ్యాడు. ఇక భారత డ్రెస్సింగ్ రూమ్ లో పరిస్థితి కత్తి వేటుకు నెత్తురు చుక్క రాలనట్లుగా ఉంది.
ఇటీవల ఉధృతంగా సాగిన చర్చను పరిగణనలోకి తీసుకుంటే ఈ టోర్నమెంట్ లో అత్యంత మెలోడ్రమటిక్ క్రికెట్ 50 ఓవర్ల గేము యథాతథంగా కొనసాగించడానికి నిజంగా అర్హమైనదేనని రుజువై ఉండాలి. కాని ఇండియా గాయాలను ఇది మాన్పజాలదు. టోర్నమెంట్ కు ముందు దక్షిణాఫ్రికాతో పాటు ఫేవరైట్లుగా పరిగణన పొందిన భారత జట్టు ముందుగానే ఇప్పుడు స్వదేశానికి సుదీర్ఘ ప్రయాణం సాగించవలసి వస్తున్నది. ఎందుకంటే జట్టు గాయాలలో చాలా వరకు స్వయంకృతమే. వాస్తవానికి పాక్ - ఆస్ట్రేలియా మ్యాచ్ ఈ టోర్నమెంట్ లో ధోని సేన ఏవిషయంలో వెనకబడిందో స్పష్టంగా సూచించింది.
Pages: 1 -2- News Posted: 1 October, 2009
|