ఫైనల్స్ లో న్యూజిలాండ్ జోహానెస్ బర్గ్: గ్రాంట్ ఎలియట్ వీరోచితంగా పోరాటం జరిపి న్యూజిలాండ్ జట్టును ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ కు చేర్చాడు. పాకిస్తాన్ జట్టుతో శనివారం రాత్రి ఇక్కడి న్యూ వాండరర్స్ స్టేడియంలో జరిగిన రెండవ సెమీఫైనల్స్ మాచ్ లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో అనూహ్య విజయం సాధించి చాంపియన్ షిప్ పై పాకిస్తాన్ పెట్టుకున్న ఆశలను అడియాసలు చేసింది. మొదట బాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది.
234 పరుగుల లక్ష్యంతో బాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టుకు ఆరన్ రెడ్మాండ్ (31), రాస్ టేలర్ (38) భాగస్వామ్యంలో గట్టి పునాది వేసినప్పటికీ న్యూజిలాండ్ ఆ అవకాశాన్ని జార విడుచుకుంది. అంతకుముందుకు ఓపెనింగ్ బ్యాట్సమన్ బ్రెండన్ మెక్ కల్లమ్ (17) ఆరంభంలోనే సృష్టించిన మెరుపులు పాకిస్తాన్ బౌలర్లను కలవరపరచింది. ఇన్నింగ్స్ రెండో బాల్ ను మెక్ కల్లం స్టాండ్స్ లోోకి పంపించి కల్లోలం సృష్టించాడు. అయితే మెక్ కల్లం ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన మార్టిన్ గుప్టిల్ (11) మంచి ఊపు మీద ఉన్నట్లు కనిపించినప్పిటీ ఉమర్ గుల్ బౌలింగ్ లో అవుట్ కావడంతో న్యూజిలాండ్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
Pages: 1 -2- News Posted: 4 October, 2009
|