త్యాగికి ఫలితం దక్కింది ముంబై : ఉత్తర ప్రదేశ్ బౌలర్ సుదీప్ త్యాగి కొన్ని సంవత్సరాలుగా పడుతున్న శ్రమకు ఎట్టకేలకు ఫలితం దక్కుతున్నది. అక్టోబర్ 25 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న ఏడు మ్యాచ్ ల ఒడిఐ సీరీస్ కోసం గురువారం ఎంపిక చేసిన భారత క్రికెట్ జట్టులో 22 సంవత్సరాల సుదీప్ ఒక్కడే కొత్తవాడు. త్యాగి తన కెరీర్ ను తుపానులా ప్రారంభించాడు.2007లో తన తొలి సీజన్ లోనే అతను 41 వికెట్లు తీసుకున్నాడు. ఒరిస్సాపై తీసుకున్న పది వికెట్లు కూడా అందులో చేరి ఉన్నాయి. అయితే, గాయంతో అతను కొంత కాలం విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది.
వెన్ను నొప్పి కారణంగా అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొలి సీజన్ లో ఆడలేకపోయాడు. దీనితో ప్రాథమిక స్థాయి నుంచి అతను తిరిగి ఆడవలసి వచ్చింది. 'దురదృష్టవశాత్తు నేను గాయపడ్డాను. అయితే, నేను స్థైర్యం కోల్పోలేదు' అని సుదీప్ త్యాగి ఒడిఐ జట్టులో తన ఎంపిక అనంతరం మీడియాతో చెప్పాడు. రంజీ ట్రోఫీలో తన రెండవ సీజన్ లో త్యాగి అంతగా ప్రభావం చూపలేకపోయాడు. కాని ఆస్ట్రేలియాలో 'ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్'లో త్యాగి మరొక సారి తన సత్తా ప్రదర్శించి 14 వికెట్లతో అత్యధికంగా వికెట్లు తీసుకున్న బౌలర్ గా ఘనత సాధించాడు. అతను ఇరానీ ట్రోఫీ పోటీలో, చాలెంజర్ ట్రోఫీ పోటీలలో కూడా బౌలర్ గా రాణించాడు.
'ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్, ఇరానీ ట్రోఫీ, చాలెంజర్ ట్రోఫీ పోటీలలో నా ప్రదర్శన వల్ల భారత జట్టులో చోటు లభించిందని భావిస్తున్నాను' అని త్యాగి చెప్పాడు. ఇటీవల నాగపూర్ లో చాలెంజర్ ట్రోఫీ ఫైనల్ లో ఇండియా రెడ్ తరఫున మునాఫ్ పటేల్, ఇశాంత్ శర్మలతో కలసి త్యాగి ఆడుతూ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని ఇండియా బ్లూ జట్టును దెబ్బ తీశాడు. ధోని జట్టు 84 పరుగులకు ఆలౌట్ అయింది. త్యాగి మూడు వికెట్లు తీసుకున్నాడు.
Pages: 1 -2- News Posted: 16 October, 2009
|