ఐపిఎల్ జట్లకు టైమేదీ? న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లోని మూడు జట్లు - దక్కన్ చార్జర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్ సిబి), ఢిల్లీ డేర్ డెవిల్స్ - చాంపియన్స్ లీగ్ ట్వంటీ20 టోర్నీలో సెమీ ఫైనల్స్ దశకు కూడా చేరుకోకుండానే తిరుగుముఖం పట్టడంతో ఈ టోర్నీపై ఆసక్తి, దీని పాపులారిటీ హరించుకుపోయాయి. దక్కన్ చార్జర్స్ జట్టు కనీసం రెండవ (సూపర్ 8) దశకు కూడా చేరుకోలేదు. ఆర్ సిబి, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు పురోగమనం సూపర్ 8 దశతో ఆగిపోయింది. ఈ మూడు జట్ల వైఫల్యం దృష్ట్యా భారతీయ దేశీయ పోటీల కార్యక్రమంలో భాగంగా మారిపోయిన లాభసాటి ఐపిఎల్ ప్రమాణం ఏ స్థాయిదని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
చాంపియన్స్ లీగ్ టోర్నీ ఐపిఎల్ జట్ల లోపాలను ఇలా బయటపెట్టిందా? పలు విదేశీ జట్ల సభ్యులు కలసి కొంత కాలం గడిపినందున అవి సంఘటితంగా ఒక బృందంగా ఆడుతుండగా ఐపిఎల్ జట్లకు అలా కలసి ఉండేందుకు తగినంత వ్యవధే లేకపోవడం ఐపిఎల్ జట్ల ఫ్లాప్ షోకు ప్రధాన కారణాలలో ఒకటని ఐపిఎల్ జట్ల అధికారులు, కొందరు క్రీడాకారులు అభిప్రాయం వెలిబుచ్చారు. 'ఐపిఎల్ జట్టులో తమ సహచరులతో కలసి తిరిగేందుకు సమయమే దొరకదు. మరి జట్టు సంఘటితం కావడం కష్టం కదా. చాంపియన్స్ లీగ్ కోసం మూడు జట్లలోని చాలా మంది కీలక క్రీడాకారులు జాతీయ జట్టుకు ఆడడంలో నిమగ్నమయ్యారు. మ్యాచ్ లు ప్రారంభం కావడానికి ఒకటి రెండు రోజుల ముందు వరకు వారు అందుబాటులో లేకపోయారు' అని డేర్ డెవిల్స్ జట్టు సభ్యుడు ఒకరు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' (టిఒఐ) విలేఖరితో చెప్పాడు. 'ఒక జట్టుగా ఆడేందుకు ఎవరైనా జట్టు తమ నుంచి కోరుతున్నదేమిటో, ఒక బృందంగా రాణించడం ఎలా అనేవి అవగాహన చేసుకోవలసి ఉంటుంది. మనం కలసి తగినంత సమయం గడపలేనప్పుడు సమస్యగానే ఉంటుంది. ఐపిఎల్ లో అది కనిపించదు. ఎందుకంటే అన్ని జట్లూ దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. కాని చాంపియన్స్ లీగ్ సంగతి భిన్నం కదా' అని ఆ క్రీడాకారుడు అన్నాడు.
Pages: 1 -2- News Posted: 20 October, 2009
|