ఆరేళ్లలో నాలుగు సార్లు... మెల్బోర్న్ : భారత, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ మధ్య పెరుగుతున్న స్పర్థ ఇంకా కొనసాగబోతున్నది. ఆరు సంవత్సరాలలో నాలుగు సార్లు ఇండియా 'డౌన్ అండర్' (ఆస్ట్రేలియా)లో పర్యటించనున్నది. భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్ టిపి) ప్రకారం ప్రపంచ చాంపియన్లు ఆసీస్ జట్టు అందుకు బదులుగా ప్రతి సంవత్సరం ఇండియాలో పర్యటిస్తుంది.
'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' సమాచారం ప్రకారం, అత్యధిక జనాకర్షణ శక్తి గల ఇండియాకు ఆరేళ్లలో నాలుగు సార్లు ఆతిథ్యం ఇవ్వడానికి ఆస్ట్రేలియా సూత్రప్రాయంగా అంగీకరించింది. 2012 ఎఫ్ టిపి ప్రకారం ఆధునిక క్రికెట్ కు ఆర్థికంగా గుండె వంటి ఇండియాను ఆస్ట్రేలియా టెస్ట్ లకు గాని, వన్ డే అంతర్జాతీయ (ఒడిఐ) పోటీలకు గాని ప్రతి సంవత్సరం వెళ్ళగలదని కూడా ఆ పత్రిక తెలియజేస్తున్నది.
ఈ కొత్త పర్యటన కార్యక్రమం ఇంకా ఖరారు కావలసి ఉంది. కాని దీనికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మద్దతు లభించింది. ఈ కార్యక్రమం కింద ఇండియా ఒక వేసవిలో టెస్ట్ ల కోసం, ఆతరువాత వన్ డే పోటీల కోసం ఆస్ట్రేలియాను దాదాపు తరచుగా సందర్శిస్తుంది.
Pages: 1 -2- News Posted: 24 October, 2009
|