ఆసియా కప్ టి 20లో పాక్? హైదరాబాద్ : గత సంవత్సరం నవంబర్ 26న ముంబైలో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో పాకిస్తాన్ క్రీడాకారులు ఆడేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన అనంతరం వరల్డ్ ఫ్యూచర్ లీగ్ (డబ్ల్యుఎఫ్ఎల్) మొదటి 'డబ్ల్యుఎఫ్ఎల్ - డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి టి20 ఆసియా కప్' టోర్నీలో పాకిస్తాన్ అండర్ 17 క్రీడాకారులను ఆడనివ్వవలసిందిగా కేంద్రానికి తాము విజ్ఞప్తి చేయగలమని మంగళవారం తెలియజేసింది. ఈ టోర్నీ డిసెంబర్ 16న హైదరాబాద్ లో ప్రారంభం కానున్నది.
లక్ష అమెరికన్ డాలర్ల నగదు బహుమతి కోసం హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించే ఈ టోర్నమెంట్ లో ఇండియా, బంగ్లాదేశ్, యుఎఇ, ఎమరాల్డ్ ఐల్, పాకిస్తాన్ జట్లు పాల్గొనగలవని డబ్ల్యుఎఫ్ఎల్ తెలియజేసింది. అయితే, డబ్ల్యుఎఫ్ఎల్ కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) గుర్తింపు లేదు. వైజాగ్ ప్రొఫైల్స్ గ్రూప్ నకు చెందిన స్టీల్ ఎక్స్ చేంజ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఇఐఎల్) ఈ డబ్ల్యుఎఫ్ఎల్ ను ప్రమోట్ చేసింది.
డబ్ల్యుఎఫ్ఎల్ సిఇఒ, డైరెక్టర్ జోసెఫ్ రెగో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, టెన్నిస్ మేటి మహేష్ భూపతితో కలసి హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 15 మంది క్రీడాకారులతో కూడిన పాకిస్తానీ జట్టు ఈ టోర్నీలో పాల్గొనేందుకు అనుమతించవలసిందిగా కోరేందుకు తాను త్వరలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరాన్ని కలుసుకోగలనని చెప్పారు. బహుశా వచ్చే వారం ఆయనను కలుసుకోగలనని రెగో తెలిపారు.
Pages: 1 -2- News Posted: 28 October, 2009
|