కాసులాటలో ఛాంపియన్లు అహ్మదాబాద్ : మొత్తం బాధ్యతలు భారత క్రికెట్ బోర్డుకు అప్పగించండి. తనకు తాను మార్కెటింగ్(అమ్మేసుకోవడం అనరాదేమో) చేసుకొనడంలోను, భారత క్రికెట్ ను అమ్మడంలోనూ అదేనండి మార్కెటింగ్ లోను బిసిసిఐ ఎంత అద్భుతమైన కృషి చేసిందంటే భారత క్రికెట్ జట్టు బ్రాండ్ ఇప్పటికీ దేశానికి అత్యధిక మొత్తాలు ఆర్జించగలదిగా ఉంది. ఏ విజయాలు సాధించకపోయినా...టి 20, వన్డే, టెస్టు... రామరామ... ఏ విధమైన క్రికెట్ లోను దాదాపు మూడు నెలలుగా ఏమీ గెలవనప్పటికీ భారత జట్టు బ్రాండ్ చెక్కు చెదరకుండా ఉంది. (భారత క్రికెట్ మార్కెటింగ్ కృషిలో మీడియా పాత్ర కూడా ఉందనడంలో సందేహం ఏమాత్రం లేదనుకోండి.)
చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ కు మనం చేరుకున్నామా? లేదు.
మరి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) జట్టు ఏదైనా చాంపియన్స్ లీగ్ సెమీఫైనల్ కు చేరుకున్నదా? లేదు.
(విలువైన కొన్ని గంటలపాటు ప్రపంచంలో నంబర్ వన్ జట్టు కావడం గురించి ప్రహసనం సాగిన తరువాత మనం అంతా భావించినట్లుగా) ఆస్ట్రేలియాను మనం ఓడించామా? అబ్బే ఎక్కడా?
వెన్నెముక గాయాలు, చీలమండ గాయాలు, తొడ కండరాల గాయాలు, పొట్ట కండరాల గాయాలు, బహుశా మనకు గుర్తులేని మరి కొన్ని గాయాలతో సతమతమవుతూనే 11 మంది క్రీడాకారులతో జట్టును సమకూర్చుకుని ఆస్ట్రేలియా చివరకు సులభంగా సీరీస్ విజయం సాధించింది.
మరి అహ్మదాబాద్ టెస్ట్ లో శ్రీలంకను మనం ఓడించే అవకాశం ఉందా? . చాల్లేండి. వేళాకోళం.
Pages: 1 -2- News Posted: 20 November, 2009
|