దారి వేస్తున్న అఫ్రిదీ ముంబై : ఈ సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో పాకిస్తానీ క్రికెటర్లు పాల్గొనవచ్చు. ఐపిఎల్ కోసం నిర్వహించిన వేలం కార్యక్రమంలో ఫ్రాంచైజీలు పాక్ క్రీడాకారులను నిర్లక్ష్యం చేయడం ఆగ్రహావేశాలకు ఆ దేశంలో దారి తీసినప్పటికీ వారు ఈ ఏడాది టోర్నీలో పాల్గొనేందుకు అవకాశం ఉందని ముంబైలో కొందరు క్రీడాకారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ సంస్థ సూచించింది.
వేలంపాటలో తమ క్రీడాకారులను ఫ్రాంచైజీలు లక్ష్యపెట్టనందుకు పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆక్షేపణలు, విమర్శలకు ఐపిఎల్ దిగ్భ్రాంతి చెందిందని భారతదేశంలోని తన మిత్రుల ద్వారా తెలియవచ్చిందని ఆ సంస్థ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వేలం కార్యక్రమంలో పాక్ క్రీడాకారుల పట్ల కొంత మెరుగైన రీతిలో వ్యవహరించి ఉండవలసిందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం, బాలీవుడ్ స్టార్, కోలకతా నైట్ రైడర్స్ (కెకెఆర్) సహ యజమాని షారుఖ్ ఖాన్ అభిప్రాయం వెలిబుచ్చారు.
'చివరకు ఈ సీజన్ కు సంబంధించి పాకిస్తానీ క్రికెటర్లతో కాంట్రాక్టు కుదుర్చుకోవడానికి ఫ్రాంచైజీలకు ఐపిఎల్ కమిషనర్ లలిత్ మోడి ఏదో మార్గం చూడవచ్చుననే సంకేతాలు వెలువడుతున్నాయి' అని పోర్ట్ ఫోలియో వరల్డ్ సంస్థకు చెందిన సల్మాన్ అహ్మద్ తెలియజేశారు. క్రీడాకారుల వేలం విషయమై తలెత్తిన వివాదం పరిష్కారానికి తాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)తో మాట్లాడగలనని, ఫ్రాంచైజీలు ఇంకా పాక్ క్రీడాకారులను సబ్ స్టిట్యూట్లుగా ఎంపిక చేయవచ్చునని ఐపిఎల్ చైర్మన్, కమిషనర్ లలిత్ మోడి సూచించారు.
Pages: 1 -2- News Posted: 26 January, 2010
|