ఐపిఎల్ రేసులో దిగ్గజాలు న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) జట్ల కోసం అపర కుబేరులు రంగంలోకి దిగుతున్నారు. కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్తలు ఐపిఎల్ ఫ్రాంచైజీలుగా ఉండటానికి తహతహలాడుతున్నారు. ఐపిఎల్ ద్వారా లభిస్తున్న ప్రచారం వారిని బాగా ఆకర్షిస్తోంది. ఐపిఎల్ లో మరో రెండు కొత్త జట్ల కోసం వచ్చే నెల బిడ్ లకు అవకాశం కల్పించినప్పుడు వాణిజ్యవేత్తలు బరిలోకి దిగనున్నారు. వారిలో హీరో హోండా, సహారా, పూనావాలా గ్రూపుల అధినేతలు కూడా ఉన్నారు. తక్కువ వ్యవధి పట్టే ఈ వర్షన్ ఆకర్షణీయంగా, మరింత లాభసాటిగా భావిస్తున్నవారు ఎక్కువవుతున్నారనడానికి ఇది సూచిక. ఎనిమిది జట్ల లీగ్ ను 2011లో నాలుగవ సీజన్ కు రెండు కొత్త ఫ్రాంచైజీలతో విస్తరించనున్నారు. బిడ్ పత్రాలను ఈ నెల చివర్లో లేదా మార్చి మొదట్లో తెరవనున్నట్లు ఐపిఎల్ వర్గాలు తెలియజేశాయి.
హీరో హోండా గ్రూపులో ఒకరైన పవన్ ముంజల్ హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల కేంద్రంగా ఒక జట్టును సొంతగా నడపాలని ఆసక్తి చూపుతున్నట్లు పరిశ్రమ వర్గాల ద్వారా తెలుస్తున్నది. అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూపు - అడాగ్ - అహ్మదాబాద్ కేంద్రంగా ఒక జట్టును ఎంపిక చేయాలని పట్టుదలతో ఉన్నది. సుబ్రతో రాయ్ కు చెందిన సహారా గ్రూపు కూడా ఒక జట్టును నిర్వహించాలని ఆసక్తి చూపుతుండగా రేస్ గుర్రాల యజమాని, వాక్సిన్ సంస్థ అధిపతి సైరస్ పూనావాలా ఒక జట్టుకు యాజమాన్యం వహించాలని అనుకుంటున్నట్లు వ్యాపార వర్గాల ద్వారా తెలుస్తున్నది.
Pages: 1 -2- News Posted: 4 February, 2010
|