భారతీయుల 'కంగారూ' అమృతసర్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మూడవ సీజన్ టోర్నీలో ఆస్ట్రేలియన్ క్రీడాకారులను ఆడనివ్వబోమని శివసేన చేసిన హెచ్చరిక ఆస్ట్రేలియాలోని భారతీయుల్లో అలజడి రేపుతున్నది. శివసేన తన వైఖరిని సడలించుకోని పక్షంలో తమకు సమస్యలు తప్పవని ఆ దేశంలో ఉన్న భారతీయులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు సేన నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు.
ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థుల సమాఖ్య (ఎఫ్ఐఎస్ఎ) ఆస్ట్రేలియన్ క్రీడాకారుల పట్ల సంఘీభావాన్ని ప్రకటించింది. క్రీడాకారుల భద్రతకు ముప్పు రాకుండా చూడాలని ఇండియాపై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని సమాఖ్య కోరింది. ఆస్ట్రేలియాలోని భారతీయుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియన్ క్రీడాకారులకు హాని కలిగించవద్దని శివసేన అధినేత బాల్ థాకరేకి విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖ రాయాలని సమాఖ్య యోచిస్తున్నది.
'ఇప్పటి వరకు బాధితులు పేద భారతీయ విద్యార్థులు మాత్రమే. ఇప్పుడు ఈ వివాదం విపరీత స్థాయికి చేరుకుని క్రీడాకారులను కూడా చుట్టుముట్టింది. ఇటీవలి వైఖరి వల్ల విద్యార్థులకు మరిన్న ఇక్కట్లు ఎదురుకావచ్చు' అని ఎఫ్ఐఎస్ఎ అధికార ప్రతినిధి మెల్బోర్న్ నుంచి ఫోన్ లో 'టైమ్స్ ఆఫ్ ఇండియా' (టిఒఐ) విలేఖరితో చెప్పారు.
Pages: 1 -2- News Posted: 10 February, 2010
|