అడ్డం తిరిగిన ఐపిఎల్ కథ ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కొత్త ఫ్రాంచైజీల ఎంపిక కోసం బిడ్డర్లకు ఒక బిలియన్ డాలర్ల నికరాదాయం ఉండాలన్న షరతుపై విమర్శలు రావడంతో రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం ఇప్పుడు జారీ చేసిన టెండర్ ను ఆదివారం ఐపిఎల్ రద్దు చేసింది. సడలించిన షరతులతో మార్చి 9న కొత్త టెండర్ ను జారీ చేయాలని ఐపిఎల్ నిశ్చయించింది. ఆదివారం ముంబైలో ట్వంటీ20 లీగ్ పాలక మండలి సమావేశం అనంతరం ఐపిఎల్ చైర్మన్, కమిషనర్ లలిత్ మోడి విలేఖరులతో మాట్లాడుతూ, పాలక మండలి టెండర్ డాక్యుమెంట్ లో 11.4 క్లాజ్ ను అమలులోకి తీసుకువచ్చిందని, ఇప్పటి టెండర్లను రద్దు చేసిందని తెలియజేశారు. 'అందిన బిడ్ లను తెరవకుండానే వాపసు చేశాం. కొత్త టెండర్లను మార్చి 9న జారీ చేస్తాం. కొత్త బిడ్ లను మార్చి 21న ఉదయం 10 గంటలకు చెన్నైలో సమర్పించవలసి ఉంటుంది. వాటిని ఆ రోజు ఉదయం 11 గంటలకు తెరుస్తాం' అని మోడి తెలిపారు.
ఆసక్తిపరులైన వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి పెక్కు లేఖలు అందినట్లు, రెండు సంవత్సరాల క్రితం మొదటి టెండర్ ప్రక్రియను ప్రారంభించి, ఇప్పుడున్న ఎనిమిది ఫ్రాంచైజీ జట్లకు విక్రయించేటప్పుడు ఒక బిలియన్ డాలర్ల నికర సంపద ఉండాలన్న షరతును బిడ్డర్లకు విధించలేదని వారు తెలియజేసినట్లు ఐపిఎల్ చీఫ్ వివరించారు. 'కొత్త టెండర్ లో నుంచి ఈ క్లాజును తొలగించాలని, 20న బిడ్డర్లు సమర్పించవలసిన 100 మిలియన్ డాలర్ల పర్ఫార్మెన్స్ డిపాజిట్ ను 10 మిలియన్ డాలర్లకు తగ్గించాలని పాలక మండలి నిర్ణయించింది. మొదటి టెండర్ సమయంలో ఇది 5 మిలియన్ డాలర్లు. కాని ఇప్పుడు మదింపు పెరిగింది కదా' అని మోడి పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 8 March, 2010
|