సెన్సెక్స్ స్వల్ప పెరుగుదల
ముంబైః ఒబామా ఆర్ధిక సంరక్షణ ప్రణాళిక ప్రకటనతో,మధ్యంతర బడ్జెట్ లో అందించినున్న ఉద్దీపన ప్యాకేజి అంచనాలలతో బిఎస్ఈ సెన్సెక్స్ మంగళవారంనాడు 0.52 శాతం తాత్కాలిక పెరుగుదల సాధించింది.ఇంజినీరింగ్ కాంగ్లామరేట్ లార్సన్ అండ్ టూబ్రో, ప్రభుత్వ రంగ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్ర్రిల్స్ సంస్థలు లాభాల బాటలో నడిచాయి. బిఎస్ఈ 30 షేర్ ఇండెక్స్ తాత్కాలికంగా 493.98 పాయింట్ల పెరుగదల సాధించి 9,633.87 పాయింట్ల వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ 50 షేర్ ఇండెక్స్ తాత్కాలికంగా 0.42 శాతం పెరుగుదల సాధించి 2,932.10 పాయింట్ల వద్ద నిలిచింది. ఫిబ్రవరి 16న ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్లోని ఉద్దీపన ప్యాకేజి ప్రకటన సైతం సెన్సెక్స్ ను పెద్దగా ప్రభావితం చేయలేకపోయింది
News Posted: 10 February, 2009
|