చీప్ టికెట్లకు గుడ్ బై
న్యూఢిల్లీః దేశీయ విమాన ప్రయాణీకుల విమాన చార్జీలు పెరుగనున్నాయి. ప్రధాన విమానయాన సంస్థలు చీప్ టికెట్ల వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఒక్క రూపాయి నుండి 99 రూపాయల దాకా ఖరీదు చేసే చీప్ టికెట్లను అందజేయడంలాంటి స్కీమ్ లకు పలు ఎయిర్ లైన్స్ స్వస్తి చెప్పాయి. ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థలు లోఫేర్-అడాన్స్ పర్చేజ్ (అపెక్స్) స్కీమ్ లను రద్దుచేస్తూ విమాన చార్జీలు మార్కెట్ నిర్ణయిస్తుందని ప్రకటించాయి.
సాదారణ విమాన చార్జీలు,ఫ్యూయల్ సర్ చార్జీల్లో ఆ విమానయాన సంస్థలు ఎలాంటి మార్పులు చేయలేదు. అన్నిటికంటే అత్యంత చౌక విమాన చార్జీలను వసూలు చేస్తున్నఎయిర్ ఇండియా సంస్థ 89 రూపాయల టికెట్ ధరను 486 రూపాయలకు పెంచింది. దాంతోపాటు ఫ్యూయల్ సర్ చార్జిని, పన్నులను వసూలు చేస్తోంది. కింది స్థాయి విమాన చార్జీల్లో మార్పులు చేయనున్నట్లు, కొన్ని సవరణలను ప్రవేశపెట్టనున్నట్లు ఎయిర్ లైన్స్ వర్గాలు తెలియజేశాయి.
మార్కెట్ ఒడిదుడుకులను బట్టి విమాన చార్జీలను సవరిస్తున్నట్లు జెట్ ఎయిర్ వేస్ అధికార ప్రతినిథి తెలిపారు.చార్జీల సవరింపు మార్కెట్ ను బట్టి రోజువారి కార్యగక్రమంగా సాగుతుంది. విమానంలో పలు క్లాసుల టికెట్లపై ఫ్యూయల్ సర్ చార్జిని వడ్డింపు మాత్రం తప్పనిసరి.
News Posted: 10 February, 2009
|