మార్కెట్లోకి 3,800 కోట్లు
న్యూఢిల్లీః ఉత్పత్తి రంగానికి, ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి పెట్టబడి అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం మరింత డబ్బును బ్యాంకులకు అందచేయనుంది. 2009-10 ఆర్ధిక సంవత్సరానికిగాను యుకో, సిబిఐ,విజయ మూడు ప్రభుత్వ బ్యాంకులకు 3,800 కోట్ల రూపాయలను రెండు విడతలుగా అందజేయాలని కేబినెట్ బుధవరంనాడు నిర్ణయించింది.
యుకో బ్యాంకుకు మొత్తం 1,200 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం అందించనుంది. ఆ మొత్తంలో 450 కోట్ల రూపాయలను 2009 సంవత్సరంలోను, 750 కోట్ల రూపాయలను 2010 సంవత్సరంలోను ప్రభుత్వం విడుదల చేయనుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 700 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం రెండు విడతలుగా నిధులను విడుదల చేయనుంది. అదేవిధంగా విజయ బ్యాంకుకు 2009లో 500 కోట్ల రూపాయలను, 2010లో 700 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది.
News Posted: 11 February, 2009
|