వాషింగ్టన్:ఒకే ఒక్క డాలర్ ను వార్షిక పారితోషికంగా తీసుకోనునన్నట్లు ప్రముఖ ఫైనాన్స్ దిగ్గజం సిటీ గ్రూప్ భారతీయ అమెరికన్ సిఈఓ విక్రమ్ పండిట్ ప్రకటించారు. సిటీ గ్రూప్ సంస్థ లాభాల బాట పట్టేంత వరకు బోనస్ కూడా తీసుకోకుండా ఒక డాలరు జీతంతో పనిచేస్తానని ఆయన తెలిపారు. సిటీ గ్రూప్ సిఈఓ పండిట్ తో సహా ఫెడరల్ రిజర్వ్ బెయిల్ ఔట్ అందుకున్న ఏడు అమెరికన్ సంస్థల సిఈఓలు ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ ముందు హజరైనారు. ఆ సందర్భంగా 2008 ఆర్ధిక సంవత్సరంలో నేను ఒక మిలియన్ డాలర్ల వార్షిక జీతాన్ని మాత్రమే పారితోషికంగా తీసుకున్నాను. 'కంపెనీకి లాభాలు వచ్చేంత వరకు బోనస్ లేకుండా 1 డాలర్ వార్షిక జీతాన్ని మాత్రమే గతంలో ప్రకటించినట్లుగా తీసుకోబోతున్నాను'అని ఆయన తెలిపారు. ఆ సమావేశంలో ఉద్రక్తులైన ప్రజా ప్రతినిధులు బెయిల్ ఔట్ ప్యాకేజి అందుకున్న కంపేనీల సిఈఓలను తీవ్రంగా ప్రశ్నించారు.
సిటీ గ్రూప్ సిఈఓ బాధ్యతల్ని విక్రమ్ పండిట్ 2007లో చేపట్టినపుడు 216మిలియన్ డాలర్ల వార్షిక పారితోషికాన్ని తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుని వార్షిక పారితోషికం 4 లక్షల డాలర్లు మాత్రమే. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బెయిల్ ఔట్ సహకారాన్ని పొందిన పలు అమెరికా కంపెనీల సిఈఓలు కోట్లాది డాలర్ల వార్షిక పారితోషికాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి వారిని 'బాధ్యారహితంగా' ప్రవర్తిస్తున్న 'వాల్ స్ట్రీట్ ఈడియట్స్'అని పేర్కొంటూ తీవ్రంగా విమర్శించారు. అందుకు పండిట్ స్పందిస్తూ తన వంతు బాధ్యతగా తన వార్షిక పారితోషికాన్ని స్వచ్ఛందంగా తగ్గించుకోవడం విశేషం. సిటీ గ్రూప్ 45 బిలియన్ డాలర్ల బెయిల్ ఔట్ ప్యాకేజిని ఫెడరల్ రిజర్వ్ నుండి అందుకోబోతోంది. చాలా ఏళ్లకు ఒకసారి సంభంవించే ఘోరమైన ఆర్ధిక సంక్షోభంలో ఉన్నామని పండిట్ వ్యాఖ్యానించారు.