15వేలకు చేరిన బంగారం
న్యూఢిల్లీః బంగారం ధర తారాజువ్వలా దూసుకెళుతోంది. 10 గ్రాముల బంగారం ధర 14,900 రూపాయలకు చేరింది. పెళ్లిళ్ల సీజన్ కావడం మూలా ఆభరణాల వ్యాపారస్తులు బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లలో కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధర వేగంగా పెరిగిపోయిందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 948.60 డాలర్లకు పెరిగింది.
ఒబామా ఆర్థిక ఉద్దీపన ప్యాకేజి ప్రకటించినప్పటికీ అమెరికా మార్కెట్లు బాగుపడవన్న బలమైన సెంటిమెంట్ ఇన్వెస్టర్లలో ఏర్పడింది. దాంతో రోజువారి ట్రేడింగ్ లో బంగారంపై మదుపు చేయడం పెరిగిపోయింది. ప్యూచర్స్ మార్కెట్ లో బంగారంపై విపరీతంగా ట్రేడింగ్ జరుగుతోంది. ఈక్విటీ, ఫారెక్స్ మార్కెట్లు దెబ్బతినిపోవడంతో ఇన్వెస్టర్లకు బంగారంపై మదుపు చేయడం మినహా వేరే అవకాసమే లేకుండా పోయింది. ఈ కారణాలన్ని కలసి బంగారం ధరను పెంచివేశాయి.
News Posted: 12 February, 2009
|