మార్కెట్లోకి సరికొత్త మొబైల్స్
న్యూఢిల్లీః ఆర్ధిక సంక్షోభం మొబైల్ హ్యాండ్ సెట్స్ మార్కెట్ ను ధ్వంసం చేసింది. దాంతో మొబైల్ కంపేనీలు సరికొత్త మార్కెట్ వ్యూహాలతో వినియోగదారులను బుట్టలో వేసుకోవాలని చూస్తున్నాయి. సరికొత్త వాణిజ్యపరమైన సెల్ ఫోన్ లను తయారీ చేసేందుకు పలు మొబైల్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఆ క్రమంలో భాగంగా శ్యామ్ సంగ్ కంపెనీ తన మౌలిక సదుపాయాలను మరింతగా విస్తరించడం ద్వారా మార్కెట వాటాను పెంచుకోవాలని చూస్తోంది. అందుకోసం దేశవ్యాప్తంగా 17 కార్యాలయాలను కొత్తగా ప్రారంభించనుంది.
సరికొత్త హ్యాండ్ సెట్ మోడల్స్ ను సరికొత్త రూపొందించడమే కాకుండా టచ్ స్క్రీన్ టెక్నాలజీ, మ్యూజిక్ సెగ్మంట్ ఫోన్లపై శ్యామ్ సంగ్ అదనంగా కేంద్రీకరిస్తోంది. శ్యామ్ సంగ్ కంపెనీ నిరుడు పలు ప్రాంతీయ పంపీణీ కార్యాలయాలను ఏర్పాటు చేసి మార్కెట్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుక తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆ కంపెనీ టెలికామ్ డివిజన్ అధినేత సునిల్ దత్ తెలిపారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా బ్రాంచ్ ఆఫీసు నెటవర్కును విస్తరింపచేయడం ద్వారా వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు కంపెనీ ప్రయత్నాలను ప్రారంభించింది. కొత్తగా విడుదల చేస్తున్న నవతరం మోడల్ ఫోన్ లను 3జి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిచడంపై కంపెనీ కృషి చేస్తోంది. ప్రస్తుతం శ్యామ్ సంగ్ కంపెనీకి మూడు రకాల 3జి ఫోన్ లు మాత్రమే మార్కెట్లో ఉన్నాయి.
'సెమీ అర్బన్ మార్కెట్లను సొంతం చేసుకునేందుకు కంపెనీకి చెందిన గురు మోడల్ ఫోన్లను 2009 జనవరి నుండి మరింత విస్తృతంగా విడుదల చేశాము. ఎఫ్ఎమ్, ఎమ్పి-3 ప్లేయర్, స్లైడర్, టార్చ్, బ్యాటరీ లైఫ్ పొడిగింపు, మొబైల్ ట్రాకర్ ల్లాంటి విశిష్ట సౌకర్యాలను సైతం చౌకైన ఫోన్లలో సైతం కంపెనీ ఏర్పాటు చేస్తోంది. గురు కేటగిరీలో మేము దాదాపు 11 మొబైల్ మోడల్స్ ను విడుదల చేశాము. గురు ఫోన్లు 1619-3499 రూపాయల వరకు ధర పలుకుతోంది.'అని దత్ తెలిపారు. ఉత్తర భారత దేశంలో శ్యామ్ కంపెనీ తన మార్కెట్ వ్యూహాన్ని మార్చుకుంది. ఒక రీజినల్ డిస్ట్రిబ్యూటర్ ను నియమించడానికి బదులుగా పలు జోనల్ డిస్ట్రిబ్యూటర్స్ ను కంపెనీ ఏర్పాటు చేసింది. భారత దేశ మొబైల్ మార్కెట్ లో శ్యామ్ సంగ్ వాటా 8 శాతం మాత్రమే. అదే సమయంలో ప్రపంచ మార్కెట్లో శ్యామ్ సంగ్ వాటా 16 శాతంగా ఉంది. దాంతో ప్రపంచ మార్కెట్ కు ధీటుగా భారతీయ మార్కెట్లో తన వాటాను రెండింతలు చేసేందుకు శ్యామ్ సంగ్ కంపనీ కృషి చేస్తోంది.
News Posted: 16 February, 2009
|