రికార్డ్ స్థాయికి గోల్డ్ ఫ్యూచర్స్
న్యూఢీల్లీ: గోల్డ్ ఫ్యూచర్స్ కొత్త రికార్డు సృష్టించింది. 10 గ్రాముల బంగారం ధర ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో 15,050 రూపాయలకు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా సాధారణ స్టాక్ ల ధరలు కుప్పకూలిపోవడంతో గోల్డ్ స్టాక్స్ కు మహర్ధశ పట్టింది. దాంతో గోల్డ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఊపందుకుంది. అనూహ్యంగా గోల్డ్ పై ఇన్వెస్టర్లు ఎగబడటంతో గోల్డ్ ఫ్యూచర్స్ రికార్డు స్థాయిలకు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లలో ఈక్విటీ షేర్ల మార్కెట్ పడిపోయి గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయి.
'మల్టీ కమడటీ ఏక్చేంజ్' (ఎమ్ సిఎక్స్ ) వద్ద ఆగష్టు నెల కాంట్రాక్ట 2.31 శాతానికి పెరిగి 10గ్రాముల బంగారం ధర 15,050 రూపాయలకు చేరింది. ఈ బంగారం కాంట్రాక్ట్ వ్యాపారాన్ని అయిదు లాట్లకు పెంచివేసింది. ఆర్ధిక మాంద్య భయాందోళనలు, ఆర్ధిక సంక్షోభం పెరిగిపోవడంతో ఆసియా మార్కెట్లలో ఒక ఔన్స్ బంగారం 956.20 అమెరికా డాలర్లకు పెరిగింది. అదే సమయంలో, ఎమ్ సిఎక్స్ వద్ద జూన్ కాంట్రాక్ట్ లో బంగారం 2.10 శాతం పెరుగుదల సాధించి 15,039 రూపాయలకు చేరింది. అంటే 370 లాట్లల టర్నోవర్ సాధించింది. అదే విధంగా ఏప్రిల్ కాంట్రాక్ట్ 2.11 శాతం పెరుగుదల సాధించి 15,029 రూపాయలకు పెరుగుదల సాధించింది. అంటే 6.221 లాట్ల టర్నోవర్ ను సాధించింది.
News Posted: 17 February, 2009
|