బంగారం ధర భగభగ
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో బంగారం ధర పెరగడం సహజం. బంగారం ధర పెరగడమంటేనే దానికి ప్రతినిధిగా ప్రపంచంలో చలామణి అవుతున్న పలు దేశాల కాగితపు కరెన్సీల విలువ తగ్గడంగా ఆర్ధికవేత్తలు చెబుతారు. సోమవారం నాడు నేషనల్ కేపిటల్ రీజియన్ లో 10 గ్రాముల బంగారం ధర 15,420 రూపాయలు రికార్డ్ స్థాయికి పెరిగింది. ప్రపంచ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ కు 960 పెరగడంతో ఒక్కరోజులో ఎన్నడూ లేనంతగా ఒకేసారిగా 560 రూపాయలు పెరిగింది.
స్టాక్ మార్కెట్లు అనూహ్యంగా కరగి పోవడం, ఫారెక్స్ మార్కెట్లు కుప్పకూలడంతో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలుకు పోటీ పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బంగారం కొనుగోలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. బులియన్ కు తమ నిధులన్నిటిని ఇన్వెస్టర్లు తరలిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లలో చిమ్మ చీకట్లు కమ్ముకోవడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు సైతం బంగారం కొనుగోళ్లకు ఎగబడ్డారు. త్వరలో 10 గ్రాముల బంగారం ధర త్వరలో 16 వేల రూపాయలకు చేరుకోగలదని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారం ధర విపరీతంగా పెరిగిపోవడం రిటైల్ కొనుగోలు దార్లను ఉదాసీనతలోకి నెట్టింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వధూవరులకు పెట్టే బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం మరింత భారంగా తయారైంది. ఎన్నడూ లేనంతగా బంగారం భగ భగలాడుతుంటే పలువురు బంగారు ఆభరణాల కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు. బంగారం ధర భూమి మీదకు వచ్చిన తర్వాత ఆభరణాలు చేయిస్తామని పెళ్లిళ్ల ఒప్పందాలను కుదుర్చుకునే పరిస్థితి తలె
News Posted: 17 February, 2009
|