రిలయన్స్ టీవీకి బిగ్ బ్రేక్
ముంబైః ప్రపంచ ఆర్ధిక సంక్షోభంతో మీడియా, ఎంటర్టైన్ మెంట్ల రంగంలో కూడా మాంద్యం నెలకొంది. దాంతో అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ కలల ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. మీడియా రంగంలో ఆదాయాలు గణనీయంగా పడిపోవడంతో ఖరైదైన కొత్త చానెల్స్ ఏర్పాటుకు ఇది సరైన సమయం కాదు. అట్టహాసంగా బ్రాడ్ కాస్టింగ్ రంగంలోకి అడుగు పెట్టేందుకు అనిల్ అంబానీ చేస్తున్న ప్రయత్నాల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవలసి వచ్చింది.
రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థకు చెందిన రిలయన్స్ బిగ్ టీవీ ఎంటర్ టైన్మెంట్, రిలయన్స్ బిగ్ టీవీ న్యూస్ కంపెనీల ద్వారా 20 చానెల్స్ ను విదల చేయాన్న ప్రణాళికలు సిద్ధమైనాయి. అదే విధంగా ఒక హింది ఎంటర్ టైన్మెంట్ చానెల్, మూడు రీజియనల్ సినిమా చానెళ్లను 2008 ఆగష్టు నాటికే విడుదల చేయాలని రిలయన్స్ పథకమేసింది. అయితే ఆర్ధిక మాంద్య పరిస్థితుల రీత్యా ఈ ప్రాజెక్టును చర్చల స్థాయిలోనే విరమించుకోవడం జరిగింది. టెలివిజన్ బ్రాడ్ కాస్టిగ్ వ్యాపారంపై అనిల్ అంబానీ గ్రూప్ ఇప్పటికీ ఆసక్తిని కనబరుస్తోందని ఒక రిలయన్స్ అదికారి తెలిపారు.
బ్రాడ్ కాస్టింగ్ రంగంలో పెద్ద ఎత్తున చానెల్స్ ఏర్పాటు చేసే ప్రణాళిక రద్దు కాలేదు, వాయిదా పడింది అంతే. మాంద్యం పరిస్థితులు కొంత సద్దుమణిగిన తర్వాత ఈ వ్యాపార ప్రణాళికను అమలు చేయాలని రిలయన్స్ భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ పరిస్థిలను కంపెనీ అంచనా వేస్తోందని సీనియర్ రిలయన్స్ అధికారి తెలిపారు. ఈ మాంద్య పరిస్థితుల్లో రోగగ్రస్థమైన బ్రాడ్ కాస్టింగ్ సంస్థలను స్వాధీనం చేసుకునేందుకు రిలయన్స్ సిద్ధంగా ఉంది. అందుకోసం ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించింది.
ఆర్ధిక మాంద్యం తలెత్తడంతో పలు వ్యాపార సంస్థల నుండి వచ్చే అడ్వర్టైజ్ మెంట్ ఆదాయాలకు పెద్ద ఎత్తున గండిపడింది. దాంతో ఈ ఆదాయాలపై ఆధారపడి నడిచే పలు ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థలు నష్టాల్లో చతికిలబడ్డాయని ఫిక్కీ, కెపిఎమ్ జిల నివేదిక వెల్లడించింది. టీవీ, రేడియా, ప్రింట్, ఔట్ డోర్ రంగాల్లో తీవ్ర ఆదాయ కొరతలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చని ఆ నివేదిక తెలిపింది.
గత మీడియా కథనాల ప్రకారం, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ కు చెందిన న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ రెండు జనరల్ చానెల్స్ ను, రెండు బిజినెస్ చానెల్స్ ను ఇంగ్లీషు, హిందీ బాషల్లో విడదల చేస్తోందని తెలిసింది. అదే విధంగా నాన్-న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ కూడా మ్యూజిక్, మూవీ చానెళ్లను, అయిదు జనరల్ ఎంటర్ టైన్మెంట్ చానెళ్లను, పిల్లల కార్యక్రమాల చానెల్స్ ను, లైఫ్ స్టైల్ చానెల్ ను విడుదల చేస్తున్నట్లు మీడియా కథనాలు తెలియజేశాయి. రిలయన్స ఎంటర్ టైన్మెంట్ సంస్థ చేపట్టే 13,035 కోట్ల రూపాయల ప్రతిష్టాత్మకమైన మల్టీ బ్రాడ్ కాస్టిటింగ్ ప్రాజెక్ట్ లో ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ జార్జ్ సోరస్ 3 శాతం వాటాను పెట్టనున్నారు. అందుకోసం ఆయన 395 కోట్ల రూపాయలను ఇప్పటికే రిలయన్స్ కు అందజేశారు.
పలు అనుబంధ, గ్రూప్ సంస్థల పేరుమీద ఈ ఎంటర్ టైన్మెంట్, మీడియా కంపెనీల్లో రిలయన్స్ అదాగ్ వాటాలను, గణనీయమైన మూలధన వాటాను కలిగి ఉంది. జాబ్ పోర్టల్, క్లాసిఫైడ్ పోర్టల్స్ తో సహా దాదాపు ఎనిమిది వెబ్ సైట్స్ ను రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఏర్పాటు చేయాలను కుంటోంది. ఆర్ధిక సంక్షోభంతో ఈ ప్రతిపాదనలన్ని తాత్కాలికంగా నిలిచిపోయాయి. గేమింగ్ పోర్టల్ జపక్, సోషల్ నెట్ వర్కింకింగ్ సైట్ బిగ్ అడ్డా, ఆన్ లైన్ మూవీ రెంటల్ బిజినెస్ బిగ్ ఫ్లిక్స్ అనే వెబ్ పోర్టల్స్ ను రిలయన్స్ ఇప్పటికే నిర్వహిస్తోంది.
News Posted: 18 February, 2009
|