తగ్గనున్నఇన్వెస్ట్ మెంట్
టోక్యో: భారత ఇన్వెస్టమెంట్ డిమాండ్ క్షీణించ నుందని ఆర్ బిఐ చీఫ్ దువ్వూరి సుబ్బారావు బుధవారంనాడు ఆందోళన వ్యక్తం చేశారు. టోక్యోలో జరుగుతున్న కాన్ఫరెన్స్ లో భారత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ డి సుబ్బారావు ప్రసంగించారు. దాంతోపాటు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం ద్రవ్యలోటు మొత్తం దేశీయోత్పత్తిలో 10 శాతానికి చేరిందని ఆయన తెలిపారు. భారత దేశం ఆర్ధికాభివృద్ది సాధించే లోపు ఇన్వెస్టమెంట్ సమస్యను ఎదుర్కోనుందని అయితే కరెంటు అకౌంట్ లోటు మాత్రం అంచనాల కంటే తక్కువగానే ఉందని సుబ్బారావు తెలిపారు.
'ఇన్వెస్ట్ మెంట్ డిమాండ్ క్షీణిస్తోంది. వినియోగ డిమాండ్ కొనసాగుతోంది. ఆర్ధిక వృద్ది జరిగే లోగా ఈ ధోరణి మరింతగా కొనసాగుతుంది.సరుకుల ధరలు చౌక కావడం వలన ఎగుమతుల కంటే వేగంగా దిగుమతులు మందగిస్తాయి. అదే సమయంలో కరెంట్ అకౌంట్ లోటు కూడా అంచనాల కంటే తక్కువగానే ఉంది.' అని సుబ్బారావు వివరించారు. అయన ఈ పరిస్థితి కొనసాగడానికి గాని, అభివృద్ధి సాధించేందుకు గాని ఎలాంటి గడువు ప్రకటించలేదు.
News Posted: 18 February, 2009
|