ద్రవ్యోల్బణం: 3.92%
న్యూఢిల్లీ: మానుఫ్యాక్చర్ వస్తువుల ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం ఫిబ్రవరి 7 వారాంతానికి 3.92 శాతానికి చేరింది. టోకు ధరల సూచి నాలుగు శాతానికి క్షీణించింది. దాంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లు తగ్గించేందుకు అవకాశం కలిగింది. కీలక వడ్డీరేట్లు త్వరలో తగ్గనున్నాయని గురువారంనాడు టోక్యో సదస్సులో ఆర్ బిఐ గవర్నర్ ప్రసంగించారు. చక్కెర, దిగమతి చేసుకున్న వంటనూనెలు, నూలు లాంటి టెక్స్ టైల్ వస్తువుల ధరలు ఈ వారంలో బాగా తగ్గిపోయాయి. అదే విధంగా రసాయనిక ఉత్పత్తులు, ఇనుము, ఉక్కు, కేబుల్స్ వగైరాల ధరలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి,. అందుకు భిన్నంగా పప్పులు, పళ్లు, కూరగాయలు, మైదా లాంటి కొన్ని ఆహార పదార్దాల ధరలు పెరిగాయి. టీ ధర తగ్గింది. ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ నాఫ్తా ధర 10శాతం, ఫర్నేస్ ఆయిల్ ధర 5 శాతం పెరిగాయి.
News Posted: 19 February, 2009
|