సత్యం బాధితులకు 'చెయ్యి'
న్యూఢిల్లీ: సత్యం కుంభకోణ బాధితులకు నష్టపరిహారం చెల్లించేది లేదని కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రేమ్ చంద్ గుప్త తెలిపారు. సత్యం రామలింగరాజు సృష్టించిన పద్దుల కుంభకోణాన్ని కేపిటల్ మార్కెట్ ఊగిసలాటలాంటి ఆర్థిక వైపరీత్యాలతో పోల్చకూడదని మంత్రి తెలిపారు. 2009 జనవరి 7 అకౌంటింగ్ కుంభకోణానికి పాల్పడినట్లు రామలింగరాజు ప్రకటించిన నాటి నుండి సత్యం షేర్లు వేగంగా పతనమై తీవ్ర ఊగిసలాటకు గురయ్యాయి. సత్యం ప్రహసనం బద్దలు కాకుముందు 188 రూపాయలుగా ఉన్న కంపెనీ షేరు ధర ఆ తర్వాత పలు ఊగిసలాటల మధ్య 38.40 రూపాయలకు చేరింది. ఈ ప్రహసనంలో పలువురు ఇన్వెస్టర్లు, కంపెనీలు నష్టపోయాయి. సత్యం బాధితులను ఆదుకునే పథకలేవీ ప్రభుత్వం చేపట్టలేదని లోకసభలో సభ్యుల అడిగిన ప్రశ్నకు గుప్త లిఖితపూర్వక సమాధానం తెలిపారు.
News Posted: 20 February, 2009
|