కోలకత: ప్రతిష్టాత్మక నానో ప్రజాకారుకు ఎస్ బిఐ ఏకైక బుకింగ్ ఏజెంట్ గా ఎంపికైంది.ఆ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ (బెంగాల్ సర్కిల్) కె సిన్హా శుక్రవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే ఆ సమావేశంలో ఆయన అంతకు మించి వివరాలేవీ వెల్లడించలేదు. 15 రోజుల్లో బుకింగ్ వివరాలను వెల్లడించనున్నామని ఆయన ప్రకటించారు. అయితే ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు టాటా మోటార్స్ అధికార ప్రతినిధి విముఖత వ్యక్తం చేశారు. గత ఏడాది న్యూఢిల్లీలో ఆటో ఎక్స్ పోలో విడుదలైన నానో కారు కోసం పలువురు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే నానో ఫ్యాక్టరీ కోసం సేకరించిన భూ వివాదం నానో వాణిజ్య ఉత్పత్తి వాయిదా పడింది. త్వరలో నానో కార్ల మార్కెటింగ్ కు టాటామోటార్స్ రంగం సిద్ధం చేసుకుంటోంది.