ప్రైస్ వాటర్ హౌస్ కు ఉద్వాసన
హైదరాబాద్: సత్యం అకౌంటింగ్ స్కాంలో ప్రధాన సాధనంగా ఉపయోగపడ్డ ప్రైస్ వాటర్ కూపర్ హౌస్ ఆడిటింగ్ సంస్థను తొలగిస్తున్నట్లు కొత్త బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఫిబ్రవరి 12 నుండి అమల్లోకి వస్తుందని సత్యం బోర్డు తెలిపింది. సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజు చేసిన 7,800 కోట్ల రూపాయల కుంభకోణంలో కంపెనీకి చెందిన ఈ ఆడింగ్ సంస్థపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సత్యం కంపెనీ ఆడిటింగ్ బాధ్యతల నుండి ప్రైజ్ వాటర్ హౌస్ ను అధికారికంగా తొలగిస్తున్నట్లు కొత్త బోర్డు నిర్ణయం తీిసుకంది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బోర్డు తమ నిర్ణయాన్ని ప్రతిపాదించింది. త్వరలోనే నూతన ఆడిటింగ్ ఏజెన్సీని నియమించనున్నట్లు సక్యం బోర్డు ప్రకటించింది.
News Posted: 22 February, 2009
|