కోక్ యాడ్స్ లో గంభీర్
న్యూఢిల్లీ: ప్రముఖ భారతీయ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సాఫ్ట్ డ్రింక్స్ దిగ్గజం కోకోకోలా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. రాబోయే ఐపిఎల్ సీరీస్ ను దృష్టిలో ఉంచుకుని క్రికెటర్స్ తో సరికొత్త మార్కెటింగ్ వ్యూహానానికి కోకోకోలా కంపెనీ శ్రీకారం చుట్టుంది. 'కోకోకోలా పురివిప్పిన సంతోషం' అనే కార్యక్రమాన్ని కోకోకోలా కంపెనీ ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా కోకోకోలాను మార్కెటింగ్ చేసుకునేందుకు అనుకూలంగా ఈ కార్యక్రమాన్ని కంపెనీ చేపట్టింది.
'అమెరికాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించిన అనంతరం భారత్ లో కూడా ప్రారంభించనున్నాము. 2009 సమ్మర్ సీరీస్ లో యువతలో క్రికెట్ పట్ల గాఢానుభూతి ప్రేరేపించేందుకు గౌతమ్ గంభీర్ ను ఎంపిక చేశాము' అని కోకోకోలా ప్రకటించింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ క్రికెట్ టీంకు ఒపెనింగ్ బాట్సమన్ గా గౌతం కంభీర్ ఆడుతున్నారు. 'కోకోకోలా ఎల్లప్పుడు రిఫ్రెష్ మెంట్, సంతోషం, ఆనంద కరమైన సన్నివేశాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ సుగుణాలన్నీ నేను కోక్ లో చూసుకుంటాను' అని గంభీర్ తెలిపారు. గంభీర్ సమ్మర్ కోకోకోలా క్యాంపెయిన్ ఈ వారంలో విడుదల కానుంది.
News Posted: 23 February, 2009
|