కార్ లోన్ల వడ్డీ తగ్గింపు
భోపాల్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్ లోన్లపై వడ్డీ రేటును ఏడాది పాటు 10 శాతానికి తగ్గిస్తున్నట్లు సోమవారంనాడు ప్రకటించింది. 11.5 శాతంగా ఉన్న వాహన రుణాల వడ్డి రేటును తగ్గించడమే కాకుండా, కార్ రుణాల ప్రాసెసింగ్ ఫీజును కూడా ఏడాది పాటు రద్దు చేసినట్లు మధ్యప్రదేశ్, చత్తీసీఘర్ చీఫ్ జనరల్ మేనేజర్ డికె జైన్ తెలిపారు. ఈ తగ్గింపు, మినిహాయింపులు సోమవారం నుండి అమలులోకి వస్తాయి. ఆర్ధిక సంక్షోభంతో దెబ్బ తిన్న ఆటోమొబైల రంగానికి ఊతమిచ్చేందుకు ఒక సామాజిక బాధ్యతగా ఈ తగ్గింపు, మినహాయింపులను చేపట్టినట్లు ఆయన తెలిపారు. 'డిమాండ్, ఉత్పత్తిలో ఏర్పడిన మాంద్యెం ఉద్యోగుల తగ్గింపుకు దారి తీస్తుంది. దాంతో నిరుద్యోగం ప్రబలుతుంది' జైన్ తెలిపారు. కార్ రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు డిమాండ్, ఉత్పత్తులను స్థిరీకరిస్తుంది. తద్వారా ప్రజలకు ఉపాధి దొరుకుతుందని జైన్ తెలిపారు.
News Posted: 23 February, 2009
|