క్రిష్ణపట్నం పోర్టులో '3ఐ'
ముంబై: క్రిష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ (కెపిసిఎల్)లో అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ '3 ఐ' గ్రూపు ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 802.9 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. కెపిసిఎల్ కంపెనీని హైదరాబాద్ నవయుగ గ్రూప్ ప్రొమోట్ చేస్తోంది. క్రిష్ణపట్నం పోర్టు అభివృద్ది, నిర్వహణ, యాజమాన్యం చేసేందుకు కెపిసిఎల్ సంస్థకు 30 ఏళ్ల ప్రభుత్వ అనుమతి లభించింది. ఈ అనుమతిని అసరమైతే 50 ఏళ్ల వరకు పొడిగించే అవకాశముంది. నిర్మాణం పూర్తయ్యేనాటికి ఈ పోర్టు 100 మిలియన్ టన్నుల కార్గో నిర్వహణ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుందని అధికారులు తెలిపారు.
'క్రిష్ణపట్నం పోర్టు కంపెనీని తూర్పు ఇండియా సముద్ర తీరంలో ఉన్నత స్థాయి పోర్టుగా అభివృద్ది చేసేందుకు మేము పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాము' అని 3ఐ ఆసియా ఆపరేషన్స్ అధినేత అనిల్ అహుజా తెలిపారు. 'క్రిష్ణపట్నం పోర్టు అత్యున్నత స్థాయి ప్రమాణాలు, సదుపాయాలు గల పోర్టుగా రూపొందుతుంది. నీటి లోతు, అనుకూలమైన భూ భాగం, మంచి రోడ్డు మార్గం, చక్కటి రైల్ కనెక్టివిటీ ఈ పోర్టుకు ఉంది' అని నవయుగ గ్రూపు చైర్మన్ సివి రావ్ తెలిపారు.
News Posted: 24 February, 2009
|