ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు
న్యూఢిల్లీ: ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్ లను ప్రభుత్వం 2 శాతం తగ్గించింది. మధ్యంతర బడ్జెట్ తో నిరాశపడిన కార్పొరేట్ రంగానికి ఈ తగ్గింపులు కొంత ఊరట కలిగించాయి. ప్రపంచ ఆర్ధిక సంక్షోభంతో మందగించిన పారిశ్రామిక రంగానికి ఈ తగ్గింపులు కొంత ఊపునిస్తాయి. సాధారణ ఎక్సైజ్ డ్యూటీని 10 శాతం నుండి 8 శాతానికి, సర్వీస్ టాక్స్ రేటును 12 శాతం నుండి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
గత ఉద్దీపన ప్యాకేజిలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన ఎక్సైజ్ డ్యూటీ నాలుగు శాతం తగ్గింపు మార్చ్ 31 అనంతరం కూడా కొనసాగుతుందని మధ్యంతర బడ్జెట్ పై చర్చ ముగింపు ఉపన్యాసంలో ఫైనాన్స్ మంత్రి ప్రణబ్ ముఖర్జీ మంగళవారంనాడు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలైన బిజెపి, వామపక్షాలు వాకౌట్ చేశాయి. అదే సమయంలో సిమెంట్ పై సర్కారు డ్యూటీని 10 శాతం నుండి 8 శాతానికి తగ్గిస్తున్నట్లు ముఖర్జీ ప్రకటించారు.
News Posted: 24 February, 2009
|